జాతీయ వార్తలు

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనం బోనస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు ఈ సంవత్సరం కూడా 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా చెల్లంచాలని నిర్ణయించింది. ప్రధాని అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. మోదీ ప్రభుత్వం గత ఆరేళ్ల నుండి రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా చెల్లిస్తోంది. రైల్వే ఉద్యోగుల ఉత్పాదకతకు ప్రతిగా కేంద్ర ప్రభుత్వం ఈ బోనస్ చెల్లిస్తోందని ఆయన చెప్పారు. భారత రైల్వేకు చెందిన దాదాపు పదకొండు లక్షల మంది ఉద్యోగులకు ఈ నిర్ణయం వలన ప్రయోజనం కలుగుతుందని జావడేకర్ తెలిపారు. పదకొండు లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ చెల్లించటం వలన కేంద్ర ప్రభుత్వంపై దాదాపు రూ.2024 కోట్ల భారం పడుతుందని అన్నారు. రైల్వేలు బాగా పని చేస్తున్నాయి.. అందుకే ఉద్యోగులకు ఇంత బోనస్ లభిస్తోందని అన్నారు. 78 రోజుల బోనస్ చెల్లించటం వలన రైల్వే ఉద్యోగులు మరింత కష్టపడి పని చేస్తారని ప్రకాశ్ జావడేకర్ ఆకాంక్షించారు.