జాతీయ వార్తలు

మత శక్తులు బలపడడానికి కాంగ్రెస్సే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, సెప్టెంబర్ 18: కాంగ్రెస్ వల్లే దేశంలో మత శక్తులు బలపడ్డాయంటూ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్‌పి) అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి ధ్వజమెత్తారు. మాయావతి కాంగ్రెస్‌పై కొత్త ఆయుధాన్ని వదిలారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాల వల్లే మత శక్తులు బలపడ్డాయని ఆమె బుధవారం చేసిన ట్వీట్‌లో మండిపడ్డారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాయావతి కోరారు. రాజస్థాన్‌లో తమ (బీఎస్‌పి) పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన అనంతరం ఆమె బుధవారం ఈ మేరకు మాటలతో దాడి చేశారు. రాజస్థాన్‌లో తమ పార్టీ ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ చీలిక తెచ్చిందని ఆమె దుయ్యబట్టారు. ఇది పూర్తిగా అనైతికం, రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికమని ఆమె విమర్శించారు.
సజీవ దహనానికి యత్నం
యూపీలోని హర్దోయి జిల్లాలో ప్రేమించిన పాపానికి ఓ దళిత యువకున్ని సజీవ దహనం చేయడానికి ప్రయత్నించడం అత్యంత హేయమైన చర్య అని మాయావతి ఆవేదన వ్యక్తం చేశారు. దళిత యువకుడైన అభిషేక్ అలియాస్ మోను మంటలతో తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని ఆమె తెలిపారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వంలో ఇటువంటి దురాగతాలు పునరావృత్తం కావని ఆమె పేర్కొన్నారు. మోను తాను ప్రేమిస్తున్న యువతిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడే ఈ ఘటన జరిగిందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పి) అలోక్ ప్రియదర్శి తెలిపారు. మోనును సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించిన వార్త తెలియగానే ఆయన తల్లి షాక్‌కు గురై మరణించినట్లు స్థానికులు చెప్పారు.