జాతీయ వార్తలు

చిన్మయానంద రేప్ కేసుపై మాట్లాడరెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి చిన్మయానందకు బీజేపీ అండగా నిలిస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. చిన్మయానంద రేప్ కేసుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పటికీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రధాని నరేంద్ర మోదీని, యూపీ సర్కారును నిలదీసింది. బీజేపీలోని సీనియర్ మహిళా నాయకురాళ్లు కూడా ఈ కేసుపై స్పందించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ప్రకటించినప్పటికీ, పరోక్షంగా చిన్మయానందకు బీజేపీ మద్దతునిస్తున్నదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శర్మిష్ట ముఖర్జీ ధ్వజమెత్తారు. దోషిని కఠినాతికఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలని ఆమె గురువారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆమె డిమాండ్ చేశారు. ఈ కేసు పట్ల యూపీ సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శంచారు. చివరికి బీజేపీలోని మహిళలు కూడా సాటి మహిళకు జరిగిన అన్యాయాన్ని నిలదీయడానికి ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన ప్రధాని మోదీ తమ పార్టీ నాయకుడి చేతిలో మహిళకు జరిగిన అన్యాయాన్ని ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించారు. నిజానికి మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుపుతున్న వారిని రక్షించడానికే మోదీ ప్రధాన్యం ఇస్తున్నారని శర్మిష్ట విరుచుకుపడ్డారు. ‘బేటీ బజావో, బేటీ పడావో’ పథకానికి కేటాయించిన మొత్తంలో సుమారు 40 శాతాన్ని కేవలం ప్రచారం కోసం వినియోగించారని, దీనిని బట్టిచూస్తే, మహిళాభ్యుదం పట్ల బీజేపీకి ఎంత వరకూ చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. దేశంలో మహిళల భద్రత కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని, అదే క్రమంలో చిన్మయానందకు సరైన శిక్ష పడేలా చూడాలని కోరారు.