జాతీయ వార్తలు

జమ్మూ కాశ్మీర్‌లో జోరుగా ‘జన జాగరణ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే రాజ్యాంగంలోని 370 ఆర్టికల్ రద్దుపై జన జాగరణ్ అభియాన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం భారీ సభలను నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. అందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్‌లో ఆరు భారీ సభలను నిర్వహించనుంది. అంతేగాక, మరో నాలుగు సాధారణ సభలకు కూడా రూపకల్పన చేస్తున్నది. 370 ఆర్టికల్ రద్దు ప్రధాన్యం, భారత దేశ సార్వభౌమాధికారం, తదుపరి చోటు చేసుకున్న పరిణామాలు వంటి అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు కేంద్రం దేశ వ్యాప్తంగా 370 సభలను నిర్వహించనుంది. అదే విధంగా 35ఏ అధికరణ రద్దును ప్రతిబించే రీతిలో 35 భారీ సభలు ఉంటాయి. కేంద్ర మంత్రులు, ప్రముఖ నేతలేకాకుండా, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, మేధావులు కూడా ఈ సభలకు హాజరై, ప్రజలను చైతన్యవంతులను చేస్తారు. కాగా, ఇందులో భాగంగా ఆరు నారీ సభలను జమ్మూకాశ్మీర్‌లో నిర్వహించి, అక్కడ పరిస్థితులను చక్కదిద్దడమేగాక, స్థానికులకు అవగాహన కల్పించాలన్నది మోదీ సర్కారు లక్ష్యంగా కనిపిస్తున్నది. ఇప్పటికే జమ్మూకాశ్మీర్‌లో రెండు సభలు జరిగినట్టు సమాచారం. కతువా, ఉద్ధాంపూర్‌లో జరిగిన ఈ రెండు సభల్లోనూ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొని ప్రసంగించినట్టు ఉన్నత వర్గాలు పీటీఐకి తెలిపాయి. ఈ నెలలోనూ మరో మూడు సభను, 22, 26, 29 తేదీల్లో జరుగుతాయని ఈ వర్గాలు వెల్లడించాయి. ఈ సభలకు వరుసగా శ్యామ్ జజూ (బీజేపీ ఉపాధ్యక్షుడు), కృషన్ పాల్ గుజ్జర్, కిరెన్ రిజిజు (కేంద్ర మంత్రులు) హాజరై ప్రసంగిస్తారు. అదే విధంగా కేంద్ర మంత్రులు వీకే సింగ్, ముస్తార్ అబ్బాస్ నక్వీ కూడా జన జాగారణ్ అభియాన్ సభల్లో పాల్గొని, 370 అధికరణ రద్దుపై వివరణలు ఇస్తారు. వచ్చేనెల మూడో తేదీన కార్గిల్‌లో జరిగే సభలో నక్వీ, దోహాలో జరిగే సభలో వీకే సింగ్ ప్రసంగిస్తారు. మొత్తం మీద, జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక గుర్తింపును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్రం అన్ని రకాలుగానూ తన చర్యను సమర్థించుకునేందుకు నడుం బిగించింది. ఇందుకోసం ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన చేసి, దానిని సమర్థంగా అమలు చేసే ప్రయత్నాలు చేస్తున్నది.