జాతీయ వార్తలు

వాద్రా భూమలు వెనక్కి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, సెప్టెంబర్ 19: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందిన భూముల రిజిస్ట్రేషన్లు రద్దుకు హర్యానా ప్రభుత్వం కసరత్తు మొదలెట్టింది. రాబర్ట్ వాద్రాకు చెందిన స్కై లైట్ హస్పటాలిటీ కంపెనీకి సంబంధించి భూమి హక్కులు రద్దుకు చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. స్కై లైట్ సంస్థ నుంచి ప్రముఖ రియాల్టీ కంపెనీ డీఎల్‌ఎఫ్‌కు భూములు బదలాయింపుజరిగింది. కంపెనీ లైసెన్సు రద్దుకు సంబంధించి ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర పట్టణ ప్రణాళికా శాఖ డైరెక్టర్ కేఎం పాండురంగ గురువారం వెల్లడించారు. హర్యానా అభివృద్ధి, క్రమబద్ధీకరణ, పట్టణ ప్రాంతాల చట్టం 1975 కింద ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. సంబందిత వ్యక్తులను నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు.‘చట్ట ప్రకారం భూమి హక్కుల రద్దు ప్రక్రియ పూర్తయింది. నోటీసులు జారీ అలాగే వారి వాదనలు వినడం కూడా పూర్తయింది. ఇక తుది నిర్ణయం తీసుకోవడమే మిగిలింది’అని పాండురంగ స్పష్టం చేశారు. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. అయితే అవతల పార్టీ వాదనలు ఏమిటి? ఏం సమాధానం చెప్పారన్న విషయంలో డైరెక్టర్ గోప్యత పాటించారు. అవేమీ వెల్లడించడానికి ఇష్టపడలేదు. భూమి మ్యుటేషన్ దగ్గర నుంచి టైటిల్ వరకూ అనేక సమస్యలున్నట్టు ఆయన పేర్కొన్నారు. స్కై లైట్, డీఎల్‌ఎఫ్ కంపెనీ మధ్య జరిగిన భూ లావాదేవీలు 2012లో వెలుగులోకి వచ్చాయి. 1991 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అశోక్ ఖేమ్కా దీన్ని బయట పెట్టారు. ఇరువురి మధ్య జరిగిన మ్యుటేషన్‌ను రద్దుచేసి దేశ వ్యాప్తంగా అందరి దృష్టీ ఆకర్షించారు. గుర్గావ్ సెక్టర్ 83లో భూమి స్కై లైట్ కొనుగోలు చేసి తరువాత డీఎల్‌ఎఫ్‌కు బదిలీ చేసినట్టు గత ఏడాది ముఖ్యమంత్రి మనోహర్ ఖట్టర్ వెల్లడించారు. ఇదంతా లోపభూయిష్టంగానే ఉందని ఆయన ఆరోపించారు. దీంతో కంపెనీ లైసెన్స్ రెన్యువల్ చేయలేదని ఆయన తెలిపారు. వాద్రా భూ లావాదేవీలన్నీ అక్రమ పద్ధతుల్లోనే సాగాయని బీజేపీ ఆరోపిస్తోంది. అప్పటి ముఖ్యమంత్రి భూపేందర్ హుడా హయాంలోనే అనేక అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఖట్టర్ ప్రభుత్వం విమర్శిస్తోంది.