జాతీయ వార్తలు

ఆరు రోజులు అమెరికాలోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఐదు రోజుల అమెరికా పర్యటన సందర్భంగా మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తారు. ఐక్యరాజ్య సమితి సమావేశంలో దేశాధినేతలతో బహుముఖ చర్చలు, అమెరికా అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు, వ్యాపారస్తులతో చర్చలు, భారతీయ సంతతివారితో సమావేశం, ఆ తరువాత న్యూయార్క్‌లో వివిధ దేశాధినేతలతో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటన సందర్భంగా దాదాపు నలభై ఐదు దేశాల అధినేలతో ముఖాముఖీ చర్చలు జరుపుతారు. ఐక్యరాజ్య సమితి సమావేశంలో ప్రసంగించడంతోపాటు ఉగ్రవాదం, అణు ఇంధనం, పరిశ్రమల స్థాపన, పర్యావరణం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు పలు ఇతర దేశాల అధినేతలతో చర్చిస్తారు. నరేంద్ర మోదీ ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే గురువారం విలేఖరుల సమావేశం నరేంద్ర మోదీ అమెరికా పర్యటన వివరాలు వెల్లడించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జయశంకర్, సహాయ మంత్రి వి.మురళీధరన్ కూడా ప్రధాని వెంట అమెరికా వెళుతున్నారని వివరించారు. నరేంద్ర మోదీ ఈ నెల 21 సాయంత్రం ఇండియా నుంచి బయలుదేరి మరుసటి రోజు అమెరికా చేరుతారు. 22వ తేదీన టెక్సాస్‌లో దిగిన వెంటనే పెద్ద పెద్ద సంస్థల సీఈఓలతో సమావేశమై ఇంధనం గురించి రౌండ్ టేబుల్ సమావేశం జరుపుతారు. ఇంధన దిగుమతితోపాటు భారత దేశంలో పెట్టుబడులు పెట్టడం గురించి ప్రధాని వీరితో చర్చిస్తారని గోఖలే తెలిపారు. అదే రోజున హూస్టన్‌లో భారతీయ సంతతివారు ఏర్పాటు చేస్తున్న ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి హాజరవుతారు. దాదాపు యాభై వేల మంది భారతీయ సంతతివారు, ఇతరులు హాజరవుతున్న ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు హాజరవుతున్నారు. అనంతరం అమెరికా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో విడిగా సమావేశమై పలు ముఖ్యమైన అంశాల గురించి చర్చిస్తారు. ఆ మరుసటి రోజు అంటే 23న న్యూయార్క్ వెళ్లి ఐక్యరాజ్య సమితిలో బహుముఖ చర్చల్లో పాల్గొంటారు. ఐరాస సెక్రటరీ జనరల్ వాతావరణ మార్పులపై ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తారు. వాతావరణ పరిరక్షణకు భారతదేశం తీసుకున్న చర్యల గురించి వివరించడంతోపాటు ప్రపంచ దేశాల నుండి ఏం ఆశిస్తున్నామనేది మోదీ తమ ప్రసంగంలో ప్రస్తావిస్తారని గోఖలే తెలిపారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆరోగ్య పరిరక్షణ చర్యలపై ఏర్పాటు చేసిన తదుపరి సమావేశంలో నరేంద్ర మోదీ ‘ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమం గురించి వివరిస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య పరిరక్షణ పథకమైన ఆయుష్మాన్ భారత్ సాధిస్తున్న ఫలితాలను మోదీ ప్రపంచ ప్రజల ముందు పెడతారు. ఉగ్రవాదం, తీవ్రవాద కార్యకలాపాలు, వాటి పర్యవసానం, ఉగ్రవాదాన్ని అదుపు చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై ఏర్పాటు చేసిన మరో సమావేశానికి నరేంద్ర మోదీ హాజరవుతారు. జోర్డాన్ రాజు, న్యూజిలాండ్ ప్రధాన మంత్రి, ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని గోఖలే చెప్పారు. నరేంద్ర మోదీతోపాటు జర్మనీ, బ్రిటన్, తదితర దేశాల అధినేతలు ఈ సమావేశంలో ప్రసంగిస్తారు. 24న ఐక్యరాజ్య సమితిలో జాతిపిత మహాత్మా గాంధీ 150 జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక చర్చా కార్యక్రమానికి నరంద్ర మోదీ, పలువురు ఇతర దేశాధినేతలు హాజరవుతారు. ఈ సందర్భంగా గాంధీ సోలార్ పార్క్, గాంధీ శాంతి ఉద్యానవనం, గాంధీ పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ లింకన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన అవార్డుల కార్యక్రమంలో నరేంద్ర మోదీ ‘గ్లోబల్ గోల్ కీపర్స్ గోల్ అవార్డు’ను స్వీకరిస్తారని గోఖలే తెలిపారు. స్వచ్ఛ్భారత్ ఉద్యమం ద్వారా భారత దేశంలో పారిశుధ్యం అభివృద్ధిలో చేసిన కృషికి ఈ అవార్డు లభించింది. నరేంద్ర మోదీ ఆ మరుసటి రోజు బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం సమావేశంలో ప్రారంభోత్సవ ప్రసంగం చేస్తారు. అనంతరం ఎన్‌డీఏ ప్రభుత్వం పెద్ద పెద్ద సంస్థలతో ఏర్పాటు చేసిన వ్యాపార రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. నరేంద్ర మోదీ ఈ నెల 27న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తారని గోఖలే తెలిపారు. ఇండియా - పసిఫిక్ దేశాల అధినేతలు, ఇండియా కారికాం నాయకుల సమావేశంలో నరేంద్ర మోదీ పాల్గొంటారు. 12 మంది పసిఫిక్ దేశాల అధినేతలు, 14 మంది కరేబియన్ దేశాల అధినేతలు ఈ రెండు సమావేశాలకు హాజరవుతున్నారు. నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు దాదాపు ఇరవై దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని గోఖలే వెల్లడించారు.

*చిత్రం...ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ