జాతీయ వార్తలు

అసాధ్యుడు అబ్దుల్లా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, సెప్టెంబర్ 19: జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తరువాత గృహ నిర్బంధంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి పరూక్ అబ్దుల్లా అసాధ్యుడని, విడిచిపెడితే అంతే సంగతులని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆగస్టు 5నే అబ్దుల్లాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలభై రోజులైనా బయటకు వదలక పోవడంతో తమిళనాడు ఎండీఎంకే చీఫ్ వైగో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఫరూక్ అబ్దుల్లాను న్యాయస్థానం ఎదుట హాజరుపరచాలని పిటిషన్ వేశారు. పిటిషన్ సోమవారం మధ్యాహ్నం విచారణకు వస్తుందనగా నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్‌కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా భద్రతా చట్టం కింద తీవ్రమైన అభియోగాల మోపింది. శ్రీనగర్‌లోని గుప్తాకర్ రోడ్డులోని ఆయన నివాసాన్ని జైలుగా ప్రకటించిన ప్రభుత్వం ప్రజా భద్రతా చట్టం(పీఎస్‌సీ) కింద తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. 81 ఏళ్ల ఫరూక్ అబ్దుల్లా శ్రీనగర్ ఎంపీగా ఉన్నారు. అంతే కాదు..మూడు పర్యాయాలు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అబ్దుల్లాను గురించి పీఎస్‌సీ ఆదేశాల్లో ఆసక్తికరమైన అంశాలు ప్రస్తావించింది. ‘అబ్దుల్లా మామూలు నాయకుడు కాదు. అసాధ్యుడు. ఆయన ప్రసంగాలంటే వేర్పాటువాదులు, తీవ్రవాదులు పడిచస్తారు. ఫరూక్ ప్రసంగాలు వారిని ఎంతో ఉత్తేజ పరుస్తాయి’అని పేర్కొన్నారు. ఉపన్యాసాల్లో దిట్ట అలాగే మాటల మాంత్రికుడు అని ఆరోపించారు. ఈ సందర్భంగా పలు సంఘటనలను ఆదేశాల్లో ఉటంకించారు. 2016 నుంచి ఏడు సార్లు జరిగిన సంఘటనలు అధికారులు గుర్తుచేశారు. ‘అబ్దుల్లా మాటంటే వేర్పాటువాదులకు వేదం. హురియత్ కాన్ఫరెన్స్, ఉగ్ర సంస్థలను ఉత్తేజ పరుస్తాయి’ అని ఆరోపించారు.
కాశ్మీర్ లోయలోనే కాదు, ప్రజలనూ రెచ్చగొట్టేస్తారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పీఎస్‌ఏ కింద గృహ నిర్బంధానికి గురైన ఫరూక్‌ను ఆరు నెలల పాటు న్యాయ స్థానంలో ప్రవేశపెట్టనక్కర్లేదు. ఆ చట్టం అందుకు వీలు కల్పిస్తుంది. ఫరూక్ అబ్దుల్లాను బయటకు వదిలితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరిస్తారని ఆ ‘కళ’ ఆయనకు ఉందని ఆదేశాల్లో స్పష్టం చేశారు. దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా తీవ్రవాదానికి ఊతం వస్తుందని తీవ్ర హెచ్చరిక చేశారు. కాగా పీఎస్‌ఏ ఒక్క జమ్మూకాశ్మీర్‌కే వర్తిస్తుంది. అయితే దేశం మొత్తానికి జాతీయ భద్రతా చట్టం(నాసా) ఉంది.

*చిత్రం...మాజీ ముఖ్యమంత్రి పరూక్ అబ్దుల్లా