జాతీయ వార్తలు

తిరుగులేని ‘అస్త్ర’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాసోర్ (ఒరిస్సా), సెప్టెంబర్ 19: అత్యంత శక్తివంతమైన అస్త్ర క్షిపణిని భారతదేశం గురువారం విజయవంతంగా ప్రదర్శించింది. సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమాన నుంచి తాజా పరీక్ష జరిగింది. సోమవారం నుంచి గురువారం మధ్య ఐదుసార్లు ఈ క్షిపణిని వివిధ కోణాల్లో విజయవంతంగా పరీక్షించారు. దాదాపు అన్ని రకాల ప్రమాదాలను ఊహించి వాటిని ఎదుర్కొనేందుకు అస్త్ర క్షిపణికున్న సత్తాను ఈ పరీక్షల ద్వారా నిర్ధారించినట్లు ఓ అధికార ప్రకటనలో తెలిపారు. లక్ష్యాన్ని నేరుగా ఢీకొనడంతో పాటు ఇతరత్రా కూడా ఈ క్షిపణి సామర్థ్యాన్ని నిర్ధారించామని ఆ ప్రకటనలో తెలిపారు. దాదాపు 100 కి.మీటర్లకు పైగా దూరంగా ఉన్న లక్ష్యాన్ని ఈ క్షిపణి ఛేదించగలుగుతుందని వెల్లడించారు. డీఆర్‌డీఓ రూపొందించిన ఈ క్షిపణి ఎలాంటి తొట్రుపాటు లేకుండా నిర్దేశిత లక్ష్యాన్ని తుత్తునియలు చేయగలుగుతుంది. ఈ క్షిపణిని యుద్ధ అవసరాలకు అనుగుణంగా మలచడంలో హెచ్‌ఏఎల్ కీలకపాత్ర వహించింది. ఐదుసార్లు అస్త్ర సత్తా రుజువుకావడంతో దీన్ని భారత వైమానిక అమ్ముల పొదిలోకి చేర్చుకునేందుకు మార్గం సుగమం అయింది.
*చిత్రం...సుఖోయ్ నుంచి అస్త్ర పరీక్ష