జాతీయ వార్తలు

ఆద్యంతం థ్రిల్లింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 19: రానున్న పదేళ్ల కాలంలో రక్షణ దళాలు దాదాపు 75 శాతం వరకు దేశీయ టెక్నాలజీనే వినియోగిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వెల్లడించారు. తేలికపాటి యుద్ధ విమానం తేజాస్‌లో ఇక్కడి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణం చేసిన అనంతరం మాట్లాడిన ఆయ న.. 2029-30 నాటికి రక్షణ దళాల అవసరాలను 75 వాతం వరకు పూర్తిస్థాయి దేశీయ టెక్నాలజీతోనే తీరుస్తామని చెప్పిన ఆయన.. ‘పూర్తిస్థాయి స్వదేశీ టెక్నాలజీని భారత్ తన రక్షణ అవసరాలకు వినియోగించుకుంటుందని ఎవరూ ఊహించలేదు’ అని అన్నారు. దాదాపు 30 నిమిషాల పాటు తేజాస్ యుద్ధ విమానంలో ప్రయా ణం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రి కూడా రాజ్‌నాథ్ కావడం గమనార్హం. పూర్తిస్థాయి స్వదేశీ టెక్నాలజీతో నిర్మించినది కావడం వల్లే తేజాస్‌లో ప్రయాణం చేయాలని తాను నిర్ణయించుకొన్నానని రాజ్‌నాథ్ తెలిపారు. ఇందులో 30 నిమిషాల ప్రయాణం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని అన్నారు. ‘అరగంట ప్రయా ణం హాయిగా సాగింది.. ఎలాంటి ఇబ్బంది కలుగలేదు.. ఎంతో థ్రిల్ ఫీలయ్యా.. నా జీవితంలో ఇది ఎంతో చిరస్మరణీయమైన అనుభవం’ అని అన్నారు. అలాగే, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో భారత సైనికులు ఇలాంటి యుద్ధ విమానాల్లో ప్రయాణం చేస్తారన్న విషయాన్ని కూడా ఈ అనుభవం ద్వారా తాను తెలుసుకోగలిగానన్నారు. జీ సూట్ ధరించి.. చేతిలో హెల్మెట్ పట్టుకొని పైలట్ కళ్లద్దాలతో కనిపించిన రాజ్‌నాథ్.. నూటికి నూరు శాతం యుద్ధ విమాన పైలట్‌గానే గోచరించారు. యుద్ధ విమానాల తయారీలో భారత్ ఓ స్థాయికి చేరుకొందని.. ఇప్పుడు విదేశాలకు కూడా ఎగుమతి చేయగలిగే సత్తాను సంతరించుకొందని రాజ్‌నాథ్ తెలిపారు. ఇందుకు విశేషంగా కృషి చేసిన హెచ్‌ఏఎల్, డీఆర్‌డీవో, సంబంధిత ఇతర ఏజెన్సీలను అభినందిస్తున్నానన్నారు. ఇప్పటికే తేజాస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి ఆగ్నేసియాలోని దేశాలు ఆసక్తిని కనబరిచాయన్నారు. అరగంట ప్రయాణంలో రెండు నిమిషాల పాటు విమానాన్ని రాజ్‌నాథ్ కంట్రోల్ చేశారని, దానిని నడిపించారు కూడా అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అయితే, ఆ రెండు నిమిషాలు తనకు ఎంతో చిరస్మరణీయ అనుభూతిని ఇచ్చాయని రాజ్‌నాథ్ వెల్లడించారు. ఈ విమానంలో మంత్రితో పాటు ఎయిర్ వైస్ మార్షల్ ఎన్ తివారీ కూడా ప్రయాణం చేశారు. తేజాస్‌కు సం బంధించిన ప్రత్యేకతల గురించి రక్షణ మంత్రికి వివరించానని తివారి తెలిపారు. అలాగే, ఎప్పటికప్పుడు విమా నం ఎంత వేగంతో వెళ్తుందో కూడా ఆయనకు చెబుతూ వచ్చానన్నా రు. తేజాస్‌లో ప్రయాణం చేయడానికి ముం దు రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీవో ప్రదర్శనను తిలకించారు.
*చిత్రం...తేలికపాటి యుద్ధవిమానం తేజాస్‌లో పయనించిన అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విజయ దరహాసం