జాతీయ వార్తలు

అనే్వషణ మాత్రమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: నల్లమల అడువుల్లో యురేనియం నిక్షేపాల తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని హోంశాఖ సహాయం మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతితోనే నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాల అనే్వషణ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యలయంలో కిషన్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ నల్లమలలో యురేనియం మైనింగ్ విషయంలో అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అణు విద్యుత్ శక్తి, యురేనియం నిక్షేపాల విషయంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోమాట మాట్లాడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని కడపతోపాటుగా దేశవ్యాప్తంగా యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. కడప జిల్లాలో యురేనియం తవ్వకాలు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నల్లమలలో యురేనియం అనే్వషణను వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో యురేనియం తవ్వకాలతో ఎటువంటి నష్టం ఉండదంటూ గిరిజనులతో చెప్పించిన మాటా వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. యురేనియం తవ్వకాల విషయంలో టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. 2016 డిసెంబరు 6న జరిగిన వన్యప్రాణి బోర్డు సమావేశంలో యురేనియం అనే్వషణకు టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అనుమతిచ్చిందని గుర్తుచేశారు. యురేనియం అనే్వషణకు ప్రభుత్వపరంగా అనుమతులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు దానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తూ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లమల అడవుల్లో యురేనియం అనే్వషణకు మాత్రమే కేంద్ర అనుమతి ఇచ్చిందని, తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. దేశ ఖనిజ సంపదపై డేటాబేస్ తయారు చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని ఆయన అన్నారు. దేశంలో అన్ని రకాల ఖనిజాలపై అనే్వషణ జరుగుతున్న మాట వాస్తవమేనని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ ఖనిజాలపై అనే్వషణ జరుగుతోందని అన్నారు. దేశంలో ఖనిజ సంపదపై పరిశోధనలు మాత్రమే ప్రస్తుతం జరుగుతున్నాయి.. తవ్వకాలకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తెలంగాణలో మాత్రమే యురేనియం తవ్వకాలు జరుపుతున్నారని బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలను ఆయన తప్పుబట్టారు. కేవలం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకే నల్లమలలో యురేనియం అనే్వషణ జరపాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నదని అన్నారు. యురేనియం నిక్షేపాల విషయంలో ప్రజలను భయాందోళనకు గురిచేసేలా బీజేపీపై తప్పుడు ప్రచారం చేయడం టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తగదని అన్నారు. అటవీ, వన్యప్రాణి , భూగర్భ జలాలు, పర్యావరణానికి నష్టం లేకుండా యురేనియం అనే్వషణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఏ ప్రాంతంలో యురేనియం ఎంత వుంది.. దాని నాణ్యత, ఉపయోగంపై మాత్రమే అధ్యయనం జరుగుతుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో బీజేపీ నేత నూనే బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...హోంశాఖ సహాయం మంత్రి కిషన్‌రెడ్డి