జాతీయ వార్తలు

అయోధ్యపై వాగుడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాసిక్ : వివాదాస్పద అయోధ్య అంశాన్ని తేల్చేందుకు సుప్రీం కోర్టు రోజువారీ విచారణ జరుపుతుందని, దీనిపై ఇష్టారాజ్యంగా మాట్లాడటాన్ని కట్టిబెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పరోక్షంగా శివసేనపై విమర్శలు గుప్పించిన ఆయన ‘కొందరు వ్యక్తులు రామ మందిరం అంశంపై ఎలాబడితే అలా మాట్లాడుతున్నారు. ఇది దిగ్భ్రాంతి కలిగిస్తోంది. సుప్రీం కోర్టు అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో గౌరవం ఉంది. దేశ న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉంచాలని ప్రతి ఒక్కరినీ చేతులు జోడించి అడుగుతున్నాను’ అని గురువారం నాడు ఇక్కడ జరిగిన ర్యాలీలో మోదీ అన్నారు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలని శివసేన దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తోంది. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దుచేసిన తరహాలోనే అయోధ్యలో ఆలయ నిర్మాణంపై కూడా మోదీ సర్కార్ నిర్ణయం తీసుకోవాలని శివసేన కోరుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తమ ప్రభుత్వం హామీల అమలుపైన పాలనను మెరుగుపరచడంపైన దృష్టి పెట్టిందని మోదీ తెలిపారు. సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, భారత్‌ను అంతర్జాతీయ శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని మోదీ తెలిపారు. అలాగే ప్రజా సంక్షేమం ఉపాథి కల్పనకు కూడా విశేష ప్రాధాన్యతను ఇస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి 20 వేల కోట్లను జమ చేశామని, ఇందులో 15 వందల కోట్లు మహారాష్ట్ర రైతులకు అందినవేనని మోదీ తెలిపారు.
వంద దేశాలకు బుల్లెట్ ఫ్రూఫ్‌ల ఎగుమతి
దేశ రక్షణకు సంబంధించి రాజీలేని రీతిలో తమ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మోదీ తెలిపారు. గత యూపీఏ ప్రభుత్వం ఈ అంశాన్ని విస్మరించిందని 2009లో దేశ జవాన్లకు 1.86 లక్షల బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు అవసరమైనా దాన్ని పట్టించుకోలేదని మోదీ విమర్శించారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ దళాల అవసరాలు తీర్చడమే గాకుండా వంద దేశాలకు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను ఎగుమతి చేశామని అన్నారు. ఇప్పుడు వీటి తయారీ భారత్‌లోనే జరుగుతుందని పేర్కొన్న ఆయన ఇటీవల రెండు శక్తివంతమైన హెలికాఫ్టర్‌లను సైన్యానికి అందించామని, త్వరలోనే రాఫెల్ యుద్ధ విమానాలు కూడా వైమానిక దళానికి చేరుతాయని మోదీ తెలిపారు.

కాశ్మీర్‌ను స్వర్గ్ధామం చేయాలి
కాశ్మీర్ ప్రజలు దశాబ్దాలు అనుభవించిన కష్టాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని మోదీ అన్నారు. ప్రతి కాశ్మీరీని చేరదీయాలని పిలుపునిచ్చిన ఆయన కాశ్మీర్ లోయలో కొత్త స్వర్గాన్ని సృష్టించాలని అన్నారు. కాశ్మీర్‌లో అల్లర్లను రగిలించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని గట్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. 370 అధికరణను రద్దు చేయడమన్నది భారత సమైక్యతను మరింత పటిష్టం చేయడానికే అని మోదీ తెలిపారు. దీని వల్ల కాశ్మీర్ ప్రజ ల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చగలుగుతామన్నా రు. దీర్ఘకాలం హింసాత్మక పరిస్థితుల్లోనే గడిపిన కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు అభివృద్ధిని కోరుకుంటున్నారని, ఉపాథిని ఆశిస్తున్నారని మోదీ అన్నారు.
ర్యాలీలో మాట్లాడుతున్న మోదీ
*చిత్రాలు.. నాసిక్‌లో గురువారం జరిగిన విజయ్ సంకల్ప్ ర్యాలీ సందర్భంగా ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, వేదికపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ప్రభృతులు కూడా ఉన్నారు. *ఛత్రపతి శివాజీకి అభివాదం