జాతీయ వార్తలు

ఇంకెంతమంది చావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 20: తమిళనాడులోని ఏఐఏడీంకే ప్రభుత్వంపై సినీ నటుడు, మక్కల్ నిధి మయం (ఎంఎన్‌ఎం) వ్యవస్థాపకుడు కమల్‌హసన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల 23ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై హోర్డింగ్ కూలి మృతి చెందడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ‘ప్రభుత్వ ఉదాసీనత’, ‘పరిణతి లేని రాజకీయ నాయకులు’ కారణంగానే ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయని శుక్రవారం చెన్నైలో ఆరోపించారు. చెన్నైలో రోడ్డుకు ఓవైపు అక్రమంగా ఏర్పాటుచేసిన ఓ హోర్డింగ్ అటుగా వెళ్తున్న శుభశ్రీ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై పడడం.. ఆమె ఆందోళన చెంది తప్పించుకొనే ప్రయత్నంలో ఓ ట్రక్కు ఆమెపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంగతి విదితమే. ఈ సంఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఈ ఘటనపై కమల్‌హసన్ స్పందిస్తూ ‘ప్రజలను ప్రభుత్వం బానిసలుగా చూస్తూ ఓ సాధారణ వ్యక్తులుగానే పరిగణిస్తోందని’ వ్యాఖ్యానించారు. ఈ సాధారణ వ్యక్తులే అసాధారణ రాజకీయ నాయకులను తయారు చేశారన్న సంగతిని పరిణతి లేని రాజకీయ నాయకులు గ్రహించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇంకెంతమంది శుభశ్రీ, రఘుపతిలను బలి తీసుకొంటారని’ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ ఉదాసీనత కారణంగానే 2017లో రఘుపతి (రఘు)పై ఎంజీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన హోర్డింగ్ కూలడం.. ఓ లారీ అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే రఘు దుర్మరణం పాలవడం తెలిసిందే. ‘ప్రభుత్వాల ఉదాసీనత, పరిణతి లేని రాజకీయ నాయకుల వైఖరి కారణంగా ఇంకెంతమందిని బలి తీసుకొంటారని’ కమల్ ప్రశ్నించారు. ‘హోర్డింగ్‌లు, ఫెక్సీలు ఎక్కడ పెట్టాలో.. ఎక్కడ పెట్టకూడదో కూడా కనీస పరిజ్ఞానం నేతలకు లేకపోవడం శోచనీయం’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఖరిని ఎవరైనా ఎండగడితే వారిని సంఘ విద్రోహులుగా అభివర్ణించడం పాలకులకు పరిపాటైపోయిందన్నారు. ఇటీవలి ఎన్నికల ప్రచార ర్యాలీలో నాథూరాం గాడ్సేను ఉద్దేశించి మాట్లాడుతూ ‘దేశంలో మొట్టమొదటి ఉగ్రవాది హిందువే’నని వ్యాఖ్యానించడం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రశ్నించే గొంతులను నొక్కడమే పరిణతి లేని రాజకీయ నేతల ప్రవర్తనకు నిదర్శనమని పై ఘటనను ఉటంకిస్తూ కమల్‌హసన్ పేర్కొన్నారు.