జాతీయ వార్తలు

భారత్ ధర్మసత్రం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాధేపుర(బిహార్), సెప్టెంబర్ 20: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో నిర్వహించిన జాతీయ పౌర రిజిస్ట్రర్(ఎన్‌ఆర్‌సీ)ని దేశ వ్యాప్తంగా చేపట్టే ప్రతిపాదన ఉందంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన ప్రకటనకు బీజేపీ సీనియర్ నేత షాన్‌వాజ్ హుస్సేన్ మద్దతు తెలిపారు. ఎక్కడి నుంచేనావచ్చి ఇక్కడ తిష్ట వేయడానికి భారత్ ధర్మసత్రం కాదని అన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన షాన్‌వాజ్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వారైనా భారత్‌లో నిరభ్యంతరంగా ఉండొచ్చు. అయితే పాస్‌పోర్టు, వీసాలు తప్పనిసరిగా ఉండి తీరాలి’అని ఆయన చెప్పారు. అంతే తప్ప తాడూబొంగరం లేకుండా వచ్చి ఉంటామని కుదరదని ఆయన పేర్కొన్నారు.‘ ఎవరైనా ఎక్కడ నుంచైనా వచ్చి ఉండేందుకు మేమేమీ ధర్మశాలను నడపడం లేదు. ఏ దేశం నుంచి వచ్చయినా భారత్‌లో నివసించ వచ్చు. అయితే అధికారిక పత్రాలు పాస్‌పోర్టు, వీసాలు ఉంటేనీ వీలుపడుతుంది. అంతే తప్ప అక్రమంగా వచ్చి తిష్టవేస్తామంటే అనుమతించబోం’అని హుస్సేన్ స్పష్టం చేశారు. అక్రమ వసలపై తమ పార్టీ మొదటి నుంచీ ఆందోళన చెందుతోందని ఆయన తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్ధి కోసం అక్రమ వలసలను ప్రోత్సహిస్తూ వచ్చాయని బీజేపీ నేత ఆరోపించారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి భారీగా చొరబాట్లు సాగాయని ఆయన వెల్లడించారు. జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి ప్రధాని మోదీ ముందుకెళ్తుంటే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు చేయడం దారుణమని ఆయన ధ్వజమెత్తారు. శత్రుదేశం పాకిస్తాన్‌కు ఊతమిచ్చేలా రాహుల్ ప్రకటనలు ఉంటున్నాయని షాన్‌వాజ్ మండిపడ్డారు. ‘రాహుల్ ఇలాంటి విమర్శలు చేయడం ఇది రెండోసారి. లక్షిత దాడుల సందర్భంలోనూ సైన్యం ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ నేత విమర్శలు చేశారు’అని బీజేపీ నేత అన్నారు. ఏవో కొన్ని రంగాలపైనే దాని ప్రభావం ఉంది. అది కూడా పరిమితంగానే.. దాన్ని చక్కదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బిహార్‌లో జెడీయూ, బీజేపీ మధ్య ఎలాంటి విభేదాలులేవన్నారు. జార్ఘండ్, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని షాన్‌వాజ్ హుస్సేన్ జోస్యం చెప్పారు.