జాతీయ వార్తలు

భాషను విధించవద్దు...వ్యతిరేకించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ‘ఏ భాషనూ బలవంతంగా విధించవద్దు...వ్యతిరేకించవద్దు’ అని ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. వీలైనన్ని ఎక్కువ భాషలను నేర్చుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా హిందీని సాధారణ భాషగా తప్పని సరి చేయాలన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనపై తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో అమిత్ షా వెనకడుగు వేయక తప్పలేదు. ఇలాఉండగా ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు శుక్రవారం విద్యార్థులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ మాతృ భాషను ఆరాధిస్తూ, ఇతర భాషలనూ గౌరవించాలని, అంతేకాకుండా వీలైనంత వరకు ఎక్కువ భాషలను నేర్చుకోవాలని సూచించినట్లు ఉప రాష్టప్రతి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని, తద్వారా వాటి ప్రాభవాన్ని తెలుసుకోవడంతో పాటు మన దేశ సంస్కృతి, చారిత్రక అంశాలను, భాషలను, వంటకాలను తెలుసుకోవాలని ఆయన విద్యార్థుల కు సూచించారు. చదువుతో పాటు శారీరక ధారుడ్యాన్ని పెంచుకోవాలని తెలిపారు. అంటు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.