జాతీయ వార్తలు

సంక్షోభం పట్టని మోదీ సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతున్నా మోదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తోందని వామపక్షాలు విరుచుకుపడ్డాయి. పరిస్థితులను చక్కదిద్ది, గాడిలో పెట్టాల్సిందిపోయి కార్పొరేట్ సంస్థలకు రాయితీల కల్పనపైనే మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని, రైతుల అవస్థలను విస్మరిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర స్వరంతో విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎదుర్కోగలిగే సత్తా ఒక్క వామపక్షాలకు మాత్రమే ఉందని ఆయన అన్నారు. గత కొన్ని నెలలుగా మోదీ ప్రభుత్వం దేశంలోని సంపన్నులకు 2.25 లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టిందని, దిక్కులేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను గాలికొదిలేసిందని ఏచూరి అన్నారు. శుక్రవారంనాడు ఇక్కడ జరిగిన ఒక సదస్సులో సీపీఎం, సీపీఐ, అఖిల భారత ఫార్వార్డ్ బ్లాక్, ఆర్‌ఎస్‌పీ పార్టీల నేతలు పాల్గొని ఆర్థిక సంక్షోభ పరిస్థితులపై చర్చించారు. అక్టోబర్ 10 నుంచి 16వరకు ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ధర్నాకు సంబంధించి కూడా వీరి మధ్య చర్చ జరిగింది. ప్రస్తుతం పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ప్రజలకు ఏరకంగానూ ఉపశమనం లేని పరిస్థితులు నెలకొన్నాయని ఏచూరి అన్నారు. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనిరీతిలో నిరుద్యోగం పెరిగిపోయిందని, పరిశ్రమలు, వ్యాపారాలు కూడా నీరుగారిపోతున్నాయని, ఉపాధి లేమి పరిస్థితి నానాటికీ తీవ్రమవుతోందని ఆయన తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిందని, గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అవుతున్నాయని ఏచూరి అన్నారు. రక్షణ, టెలికాం రంగంలో నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులకు పెద్దపీట వేయడం వల్ల దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. కార్పొరేట్ సంస్థలకు రాయితీలు కల్పించడం, షేర్ మార్కెట్లలో ఊహాజనిత పెట్టుబడులకు ఆస్కారం ఇవ్వడం మాని, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలని, ఆ విధంగా ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నివ్వాలని ఆయన సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఉద్యోగ వర్గాలను, ఇతర అణగారిన వర్గాల ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి రాజా పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితి నుంచి దేశాన్ని రక్షించాల్సిందిపోయి బీజేపీ, ఆరెస్సెస్ కూటమి రాజకీయ, సామాజిక సంక్షోభంలోకి నెట్టేసిందని ఆయన అన్నారు. 370 అధికరణ రద్దు, మూక హత్యలు, ఎన్నార్సీ అమలు మొదలైనవన్నీ ఇందుకు కారణం అవుతున్నాయని ఆయన అన్నారు. ఈ సమావేశం అనంతరం ఐదు వామపక్ష పార్టీలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఉపాధిని పెంచేందుకు పెట్టుబడులు పెట్టాలని, నిరుద్యోగ భృతిని కల్పించాలని డిమాండ్ చేశాయి. కనీస వేతనాన్ని 18వేల రూపాయలుగా నిర్ణయించాలని, ఉద్యోగాలు కోల్పోయిన వ్యక్తులకు భృతిని కల్పించాలని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించే చర్యలను కట్టిపెట్టాలని డిమాండ్ చేశాయి.