జాతీయ వార్తలు

ఇదేమి చోద్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, సెప్టెంబర్ 20: గత ఏడు వారాలుగా కాశ్మీర్‌లో ఎలాంటి మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సర్వీసులు లేకపోయినా తమ నెత్తిన బిల్లులు మాత్రం రుద్దుతున్నారని కాశ్మీర్ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇంతవరకు తాము మొబైల్ ఫోన్ వినియోగించుకోకపోయినా ఇంటర్నెట్ సర్వీసులు వాడకపోయినా కూడా టెలికాం కంపెనీలు భారీగా బిల్లులు వడ్డిస్తున్నాయని కాశ్మీర్ లోయలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 5న కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసిన కేంద్రం రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిక ప్రాంతాలుగా విభజించింది. అప్పటినుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 47 రోజులుగా కమ్యూనికేషన్ సర్వీసులన్నీ నిలిచిపోయాయి. ‘నేను ఇంతవరకు ఫోనే వాడలేదు. నాకు ఎయిర్‌టెల్ కంపెనీ 779 రూపాయల బిల్లు పంపించింది. ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడంలేదు’ అని ఒబాయిద్ నబీ అనే ఒక పౌరుడు తెలిపాడు. తనకు బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ కనెక్షన్ ఉందని, అందుకు నెలకు 380 రూపాయలు కట్టేవాడినని చెబుతున్న మహమ్మద్ ఉమర్ అనే మరో వినియోగదారుడు ‘గత నెలకు సంబంధించిన 470 రూపాయల బిల్లు పంపారు. ఇదేమిటో అర్థం కావడంలేదు’ అని ఆయన అన్నాడు. 2016లో జరిగిన ఉద్యమం, 2014లో జరిగిన వరదల సమయంలో రాష్ట్రంలో కమ్యూనికేషన్లు నిలిచిపోయాయని, అప్పట్లో కమ్యూనికేషన్ చార్జీలు రద్దు చేశారని గుర్తు చేసుకుంటున్న పౌరులు ఈసారి ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రజల సమస్యలను భారతీ ఎయిర్‌టెల్ దృష్టికి తెచ్చినా దానినుంచి ఎలాంటి సమాధానం రాలేదు. బీఎస్‌ఎన్‌ఎల్ కూడా ఉదాసీన వైఖరిని అవలంబిస్తోంది. వొడాఫోన్ ఐడి యా, రిలయన్స్ జియోల నుంచి వివరాలు అడిగినా వాటికీ సమాధానం లేదని పౌరులు చెబుతున్నారు. గత నెలన్నరగా రాష్ట్రంలో స్కూళ్లు పనిచేయలేదని, తమ పిల్లలు కూడా పాఠశాలలకు వెళ్లడం లేదని చెబుతున్న పౌరులు ‘పాఠశాల యజమానులు మమ్మల్ని ఏదో సాకుతో స్కూళ్లకు పిలిపించి ఫీజులు కట్టమంటున్నారు’ అని తెలిపారు.ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు కూడా రవాణా చార్జీలు సహా అన్నిరకాలుగాను తమపై భారం వేస్తున్నారని తెలిపారు.
స్కూళ్లు పనిచేయకపోయినా సిబ్బందికి ఆయా పాఠశాలల యాజమాన్యాలు జీతాలు చెల్లించాల్సి ఉంటుందన్న విషయం తమకు తెలిసినప్పటికీ పిల్లలు స్కూళ్లకు వెళ్లనపుడు రవాణా చార్జీలను ఎందుకు వసూలు చేస్తున్నారో అర్థం కావడం లేదని మరో పౌరుడు ఆవేదన వ్యక్తం చేశాడు.