జాతీయ వార్తలు

పాక్‌తో యుద్ధానికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 20: లక్షిత దాడుల సందర్భంగా పాకిస్తాన్‌కు చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు విడిపించడంలో కేంద్ర నాయకత్వం సమర్ధవంతంగా పనిచేసి సత్తాచాటించదని ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ప్రకటించారు. ప్రభుత్వం అప్పటికప్పుడు స్పందించి అభినందన్‌కు విముక్తి కల్పించినట్టు శుక్రవారం ఇక్కడ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌తో యుద్ధానికి ఐఏఎఫ్ సిద్ధమని ఆయన వెల్లడించారు. కేంద్ర నాయకత్వం ఎప్పుడు చెబితే అప్పుడు రంగలో దిగుతామని ఆయన అన్నారు. బాలాకోట్‌పై లక్షిత దాడుల సందర్భంలో మిగ్-21 బైసన్ విమానంలో వెళ్లిన అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్తాన్ బందీగా పట్టుకుంది. ఫిబ్రవరి 27న ఈ సంఘటన చోటుచేసుకుంది. మిగ్-21ను పాకిస్తాన్ కిందకు దించకముందే ఆ దేశానికే చెందిన ఎఫ్-16 విమానాన్ని అభినందన్(36) కూల్చివేశారు. కేంద్రం సకాలంలో స్పందించడంతో మార్చి 1న వింగ్ కమాండర్‌ను పాక్ విడుదల చేసింది. ‘ఇండియా టుడే కాంక్లెవ్’లో ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా అనేక విషయాలు వెల్లడించారు. వింగ్ కమాండర్ అభినందన్ చిన్నతనం నుంచి తనకు తెలుసని అన్నారు. అభినందన తండ్రి కూడా ఎయిర్ ఫోర్స్‌లో పనిచేశారని, ఆయనతో కలిసి తాను పనిచేశారని ధనోనా గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి అభినందన్‌ను తాను చూస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ‘కార్గిల్ యుద్ధం సందర్భంగా ఫ్లయిట్ కమాండర్ అజయ్ అహుజాను కోల్పోయాం. అజయ్ విమానం పాక్ సరిహద్దుల్లో దిగింది. విమానం నుంచి దిగడానికి ఆయన నిరాకరించారు. దీంతో శత్రుసైనం అజయ్‌పై కాల్పులు జరిపింది. ఆయన మరణం నేను ఎప్పటికీ మరచిపోలేను’అని ధనోవా స్పష్టం చేశారు. ‘అహుజాలా కాదని, అభినందన్‌ను స్వదేశానికి తీసుకొచ్చితీరతామని ఆయన తండ్రికి నేను చెప్పాను. అలాగే జరిగింది’అని ఎయిర్ చీఫ్ మార్షల్ వెల్లడించారు. కేంద్ర నాయకత్వం సమర్థవంతంగా పనిచేయబట్టే రికార్డు సమయంలో వింగ్ కమాండర్ అభినందన్‌ను విడిపించగలినట్టు ఆయన తెలిపారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా ఈ నెలాఖరున పదవీ విమరణ చేయనున్నారు.