జాతీయ వార్తలు

జీవ, రసాయన దాడులపై జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్వాలియర్, సెప్టెంబర్ 20: మారుతున్న యుద్ధ తంత్రం నేపథ్యంలో జీవ, రసాయన దాడుల నుంచి సైనిక దళాలను రక్షించడానికి వీలుగా వారికి పటిష్టమైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ముందస్తుగానే ఈరకమైన శిక్షణ పొందడం వల్ల భవిష్యత్ కష్టనష్టాలను పూర్తిస్థాయిలో నివారించడం సాధ్యమవుతుందని శుక్రవారం ఇక్కడ జరిగిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) సమావేశంలో ఆయన అన్నారు. ఇందులో పాల్గొన్న శాస్తవ్రేత్తలను ఉద్దేశించి మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్ ‘్భరత సైనిక దళాలు ఎంతో ప్రతికూలమైన వాతావరణం కలిగిన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిపై ప్రత్యర్థులు జీవ, రసాయనిక దాడులకు పాల్పడే అవకాశం ఎంతైనా ఉంది’ అని అన్నారు. ఈరకమైన దాడులకు ప్రత్యర్థులు తెగబడితే సైనికుల ప్రాణాలకే కాకుండా ఆరోగ్యానికి కూడా తీవ్ర స్థాయిలో ముప్పువాటిల్లే ప్రమాదం ఉంటుందని, అంతేకాకుండా ఆస్తుల ధ్వంసంతోపాటు వ్యాపార, వాణిజ్యాలు దెబ్బతింటాయని ఆయన అన్నారు. ముందస్తుగా నివారణ, నిరోధక చర్యలు తీసుకోకపోతే ఇలాంటి వాటినుంచి బయట పడేందుకు దీర్ఘకాలమే పడుతుందని రాజ్‌నాథ్ హెచ్చరించారు. దీని దృష్ట్యా రసాయన, జీవ దాడులను సైతం ఎదుర్కొనే రీతిలో సైనికులకు తగిన శిక్షణతోపాటు సాధన సంపత్తిని సమకూర్చాలని రాజ్‌నాథ్ ఉద్ఘాటించారు. ముందుగానే జీవ, రసాయనిక ఆనవాళ్లను గుర్తించడం అన్నది ఆ తరహా దాడులకు బలమైన పునాది అవుతుందని అన్నారు. గత 45 సంవత్సరాలుగా డీఆర్‌డీఏ చేస్తున్న సేవలను శ్లాఘించిన ఆయన ఈరకమైన జీవాయుధాల నిరోధనలో ఈ సంస్థ చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. జీవ, రసాయన ఆయుధాలను గుర్తించి, నిరోధించడంలో డీఆర్‌డీఏకి అంతర్జాతీయ ఖ్యాతి ఉందని ఆయన తెలిపారు. రసాయన, జీవాయుధాలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేయడానికి ఈ సంస్థ మరింతగా దృష్టి పెట్టాలని, అందుకు అవసరమైన సాధనా సంపత్తిని సమకూర్చుకోవాలని రాజ్‌నాథ్ అన్నారు. దేశ భద్రతలో సైనికుల పాత్ర ఎంత నిరుపమానమో వారిని అన్నిరకాల దాడుల నుంచి రక్షించగలిగే శాస్తవ్రిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవడంలో శాస్తవ్రేత్తల పాత్ర అంతే కీలకం అని ఆయన అన్నారు.