జాతీయ వార్తలు

17 రాష్ట్రాల్లో మోగిన నగారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: మహారాష్ట్ర, హర్యానా శాసనసభలకు ఎన్నికలు, తెలంగాణ తదితర పదిహేడు రాష్ట్రాల్లోని 63 శాసనసభ సీట్లు, బిహార్‌లోని ఒక లోకసభ స్థానానికి ఉప ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, హర్యానా శాసనసభలతోపాటు 63 ఖాళీ స్థానాలకు అక్టోబర్ 21న ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. రెండు రాష్ట్రాల శాసనసభలు, 17 రాష్ట్రాల్లోని 63 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 24న ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా శనివారం విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్‌డీఏ రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారి జరుగుతున్న ఎన్నికలివి. నాలుగు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన భారీ మెజారిటీ, మోదీ ప్రభుత్వం ఇటీవల జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని నిర్వీర్యం చేసి ఆర్టికల్ 35ను రద్దు చేయటం, ట్రిపుల్ తలాక్ బిల్లుకు చట్టరూపం కల్పించిన నేపథ్యంలో జరుగుతున్న మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల్లో అధికార పార్టీ మరోసారి ఘనవిజయం సాధించే అవకాశాలున్నాయి.
మహారాష్ట్ర, హర్యానా శాసనసభలకు పోటీ చేసేవారు తమ నామినేషన్ పత్రాలను అక్టోబర్ నాలుగో తేదీలోగా దాఖలు చేయవలసి ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ ఏడో తేదీతో గడువు ముగుస్తుంది. బిహార్‌లోని ఒక లోక్‌సభ సీటుతోపాటు పదిహేడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 63 శాసనసభ సీట్లకు జరిగే ఉప ఎన్నికలకు నామినేషన్లను సెప్టెంబర్ 30లోగా దాఖలు చేయవలసి ఉంటుంది. నామినేషన్లను అక్టోబర్ 3లోగా ఉపసంహరించుకోవలసి ఉంటుంది. కోటీ ఎనభై రెండు లక్షల మంది ఓటర్లున్న హర్యానా శాసనసభ కాల పరిమితి నవంబర్ రెండుతో ముగుస్తుంటే.. ఎనిమిది కోట్ల తొంభై లక్షల మంది ఓటర్లు ఉన్న మహారాష్ట్ర శాసనసభ కాల పరిమితి నవంబర్ 9వ తేదీతో ముగుస్తుంది.
తెలంగాణతోపాటు అరుణాచల్‌ప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్, అస్సాం, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పాండిచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌లోని 63 శాసనసభ సీట్లకు ఉప ఎన్నికలు జరగవలసి ఉన్నది. వీటితోపాటు బిహార్‌లోని ఒక లోక్‌సభ సీటుకు ఉప ఎన్నికలు జరుగుతాయి. కర్నాటకలో పదిహేడు, అస్సాం, గుజరాత్, పంజాబ్, బిహార్ రాష్ట్రాల్లో నాలుగేసి స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో పదకొండు, కేరళలో ఐదు, సిక్కింలో మూడు, హిమాచల్‌ప్రదేశ్‌లో రెండు, తమిళనాడు, రాజస్థాన్‌లో రెండేసి స్థానాలకు, అరుణాచల్‌ప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మేఘాలయ, ఒడిశా, పాండిచ్చేరిలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతాయి.
శాసనసభల, ఉప ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్ ప్రచార సామాగ్రిని ఉపయోగించకూడదని ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా అన్ని రాజకీయ పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతో దోహదపడుతుందని ఆయన సూచించారు. ఎన్నికల ప్రచారం కోసం ఆయా రాజకీయ పార్టీలు పెద్దఎత్తున బ్యానర్లు, స్టిక్క, ఇతర ప్రచార సామాగ్రిని ఉపయోగించటం తెలిసిందే. తమ ఎన్నికల ప్రచార సామాగ్రిని తయారు చేసుకోవటంలో ప్లాస్టిక్‌ను ఉపయోగించకూడదని సునీల్ అరోరా విజ్ఞప్తి చేయడం విశేషం.
*చిత్రం... న్యూఢిల్లీలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తున్న కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా. ఇరువైపుల కమిషనర్లు అశోక్ లవాసా, సునీల్ చంద్ర