జాతీయ వార్తలు

గాంధీ ఆదర్శాలు విస్తృతంగా ప్రచారం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన సిద్ధాంతాలు, ఆదర్శాలపై విస్తృత ప్రచారం చేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ ఎంపీలకు, రాష్ట్ర విభాగాల నేతలకు పిలుపునిచ్చారు. శనివారం వీరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఈ ఉత్సవాలకు సంబంధించి విస్తృత ప్రణాళికను ఆవిష్కరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఆయన విడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్థిక అంశాల గురించి చర్చించారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. కార్పొరేట్ పన్ను తగ్గింపు సహా మోదీ సర్కారు తీసుకున్న ఈ ఉద్దీపన చర్యల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత పుష్టి కలుగుతుందని వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిందని, ఆర్థిక మాంద్యం అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్నదంటూ ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో అమిత్ షా ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి పెట్టడం గమనార్హం. వచ్చే నెలలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా విపక్షాల దాడులను వ్యూహాత్మకంగా తిప్పికొట్టేందుకే పార్టీ శ్రేణులతో ఆర్థిక అంశాలను అమిత్ షా విస్తృతంగా చర్చించారని చెబుతున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. ఎంపీలతో మాట్లాడిన ఆయన మహాత్మా గాంధీ ప్రవచించిన విలువలను జనంలోకి తీసుకెళ్ళాలని, అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించి ఆయన ఆశయాలను పరివ్యాప్తం చేయాలని అన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, పర్యావరణం, ఖాదీ వినియోగం వంటి వాటిపై ప్రచారం నిర్వహించాలని ఆయన అన్నారు. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి సర్దార్ పటేల జయంతి రోజైన అక్టోబర్ 31 వరకు 150 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయాలని పార్టీ ఎంపీలను ప్రధాని మోదీ ఇదివరకే కోరిన సంగతి తెలిసిందే.
ఈ ప్రచారంలో ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రజలను చైతన్యవంతం చేయాలని పార్టీ నేతలను కోరారు. అలాగే అందరు ప్రముఖ నేతల విగ్రహాలను కూడా సిద్ధాంతాలకు నిమిత్తం లేకుండా ప్రక్షాళన చేయాలని కూడా బీజేపీ నేతలు పార్టీ శ్రేణులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

*చిత్రం...బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా