జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో కాలు మోపిన ఆజాద్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, సెప్టెంబర్ 21: కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఎట్టకేలకు కాశ్మీర్‌లో రెండో రోజూ తన పర్యటన కొనసాగించారు. ప్రజలను కలుసుకుని వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. రాజ్యాంగంలోని 370-అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను తొలగించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి, ప్రజలను కలుసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు కాశ్మీర్‌కు తరలి వస్తుండడంతో ప్రభుత్వం నిషేధం విధించింది. వారి రాకతో శాంతి-్భద్రతలకు విఘాతం కలుగుతున్నందున ఎవరినీ అనుమతించరాదని నిర్ణయం తీసుకుంది. దీంతో గులాం నబీ ఆజాద్‌కు తన సొంత రాష్టమ్రైన కాశ్మీర్‌కు వెళ్ళేందుకు కష్టతరమైంది. లోగడ ఆజాద్ కాశ్మీర్‌కు చేరుకున్నా, విమానాశ్రయం నుంచే పోలీసులు వెనక్కి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆజాద్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆజాద్ తరఫున సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వి కోర్టులో తమ వాదన వినిపిస్తూ ప్రజలను కలుసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

*చిత్రం... ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్