జాతీయ వార్తలు

నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ 8కి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: నేషనల్ హెరాల్డ్ కేసు విచారణను ఢిల్లీ కోర్టు ఏప్రిల్ 8వ తేదీకి వాయిదా వేసింది. పాటియాలా హౌస్ కోర్టులో కాంగ్రెస్ తరపున వాదిస్తున్న న్యాయవాది.. భారత జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించిన 2010-11 సంవత్సర ఆర్థిక వివరాలు ఆ పార్టీ ఆఫీస్ బేరర్లనుంచి ఇంకా తనకు అందలేదని సోమవారం విచారణ సందర్భంగా కోర్టుకు విన్నవించారు. కేసు దర్యాప్తు కోసం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అసోసియేటెడ్ జర్నల్స్ ప్రైవేట్ లిమిటెడ్, యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యాలెన్స్ షీట్లను సమర్పించాలని ఆదేశించాల్సిందిగా కోరుతూ బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి చేసిన అభ్యర్థనను మార్చి 11న ఢిల్లీ కోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే. జవహర్‌లాల్ నెహ్రూ 1938లో నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రారంభించారు. ఈ పత్రిక యాజమాన్య సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఎజెఎల్)కు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎలాంటి వడ్డీ లేకుండా రూ. 90.25 కోట్ల రుణం ఇవ్వడంపై ఈ కేసు దాఖలయింది.