జాతీయ వార్తలు

పరిమిత యుద్ధం తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పాకిస్తాన్‌తో పరిమిత యుద్ధం తప్పదా? భారత సైన్యానికి చెందిన ప్రత్యేక పారాట్రూపర్లు బుధవారం రాత్రి ఆక్రమిత పాకిస్తాన్‌లో దాదాపు మూడు కిలోమీటర్ల లోపలికి చొచ్చుకుపోయి ఏడు సైనిక శిబిరాలపై దాడులు జరిపిన నేపథ్యంలో నెలకొంటున్న పరిణామాలు చూస్తుంటే పరిమిత యుద్ధం తప్పదేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం భవిష్యత్ పరిణామాలను సమీక్షించి వాటిని ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధమైన తరువాతనే లక్షిత (సర్జికల్) దాడులు చేసిందని రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. పాక్‌ను శాశ్వతంగా దారికి తేవాలంటే పరిమిత యుద్ధం తప్పదని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోందనే మాట వినిపిస్తోంది.
ఉగ్రవాదులను ఏరివేసేందుకే
ఆక్రమిత కాశ్మీర్‌లో దాడులకు దారితీసిన పరిస్థితులను వివరించటంలో మోదీ ప్రభుత్వం ఎంతో తెలివి, చాతుర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదులను ఏరి వేసేందుకే దాడులు నిర్వహించాం తప్ప పాక్ సైన్యంపై దాడికి దిగలేదని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతోంది. పాకిస్తాన్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది కాబట్టే లక్షిత దాడుల అవసరం ఏర్పడుతోందనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ఆక్రమిత కాశ్మీర్‌లోని ఏడు చోట్ల దాడులను అత్యంత గోప్యంగా నిర్వహించిన మోదీ ప్రభుత్వం దాడుల ప్రక్రియ పూర్తికాగానే పెద్దఎత్తున ప్రచార యుద్ధం ప్రారంభించటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
దాడులు ముగిసిన వెంటనే హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యమైన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు టెలిఫోన్ చేసి దాడుల గురించి వివరించారు. ఆ తర్వాత ఆ తరువాత సౌత్ బ్లాక్‌లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సర్జికల్ దాడుల గురించి వివరించారు. డిజిఎంఓ లెఫ్టెనెంట్ జనరల్ రణబీర్ సింగ్, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు నాలుగు గంటలపాటు జరిపిన సర్జికల్ దాడుల గురించి వివరించారు. సైనిక దళాలు జరిపిన దాడులకు అఖిలపక్షం మద్దతు సంపాదించటంలో ప్రభుత్వం విజయం సాధించింది. పాక్‌తో పరిమిత యుద్ధం జరిగే పక్షంలో స్వదేశంలోని ప్రతిపక్షంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో మద్దతును పదిలం చేసుకునేందుకే మోదీ ప్రభుత్వం ఈ త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్.డి.ఏ ప్రభుత్వం ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేస్తోంది. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌ను మొదట దౌత్యపరంగా ఏకాకిని చేసి ఆ తరువాత వాణిజ్య, జల సంబంధ సమస్యల్లో ఇరికించేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు లక్షిత దాడుల ద్వారా సైనిక పరమైన చర్యలు తీసుకోవటం ద్వారా పాక్‌ను దెబ్బ తీశారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం త్రిముఖ వ్యూహంతో పాక్‌ను దెబ్బ తీస్తోంది. పాక్ దీనికి ఎలా స్పందిస్తుంది? నేరుగా యుద్ధానికి దిగుతుందా? లేక ఇస్లామిక్ ఉగ్రవాదం ద్వారా తన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ప్రయోగిస్తే భారత దేశం ఇదే రీతిలో లక్షిత దాడులను కొనసాగిస్తుంది, ప్రత్యక్ష యుద్ధానికి దిగతే గట్టి గుణ పాఠం చెబుతుందని అంటున్నారు. ఇంతకాలం పాక్ కవ్విస్తే ఇప్పుడు భారత్ వ్యూహత్మక కవ్వింపులు ప్రారంభించింది. రెండు దేశాల వ్యూహ, ప్రతి వ్యూహాలు చివరకు పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీసినా ఆశ్చర్యపోకూడదని అంటున్నారు.