జాతీయ వార్తలు

దటీజ్ రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, అక్టోబర్ 9: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి భయపడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ వైదొలిగారని తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటుంటే, ఆ పార్టీ లోక్‌సభ నాయకుడు ఆధీర్ చౌదరి మాత్రం భిన్నంగా స్పందించారు. రాహుల్ గాంధీ వంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని ఆధీర్ పొగడ్తలతో ముంచెత్తారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ వంటి నాయకులు నేటి రాజకీయాల్లో ఒకరో ఇద్దరో ఉంటారని లోక్‌సభాపక్ష నేత అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ పారిపోయారంటూ దుమ్మెత్తిపోశారు. దీనిపై చౌదరి స్పందించారు. ‘రాహుల్‌పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి నాకూ తెలుసు. అయినప్పటికీ పెద్ద రాజకీయ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగడం మామూలు విషయం కాదు. రాహుల్ వంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. నైతిక విలువలకు కట్టుబడిన వారే అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోగలరు’అని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ అధ్యక్షుడి పదవి చేపడితే సంతోషిస్తామని ఆయన అన్నారు. నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చిన ఆయన తీరును ప్రశంసించలేకుండా ఉండలేమని లోక్‌సభ నేత వెల్లడించారు. భారత రాజకీయాల్లో రాహుల్ వంటి నేతలు అరుదుగా కనిపిస్తారని, ఓటమికి నైతిక బాధ్యత వహించి అధ్యక్ష పదవిని తృజించడం చిన్న విషయం కాదని చౌదరి చెప్పారు. ఆయన నుంచి తామంతా గుణపాఠం చేర్చుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ఆధీర్ ‘రాహుల్ తిరిగి అధ్యక్ష పదవి చేపడితే మాకెంతో ఆనందం. ఆయనను మేమందరం ప్రేమిస్తాం’అని అన్నారు. రాహుల్ ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తామని కాంగ్రెస్ నేత స్పష్టం చేశారు. ఏది ఏమైనా తమ నాయకుడు రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం గొప్పదని ఎందరికో అది సందేశమవుతుందని ఆదీర్ వ్యాఖ్యానించారు.