జాతీయ వార్తలు

పట్టాలు తప్పిన మరమ్మతు రైలింజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 9: రైలు పట్టాలను, కంకర, రైల్వే ట్రాక్‌పై మరమ్మతులు చేసే రైలింజన్ పట్టాలు తప్పింది. మహబూబ్‌నగర్ జిల్లా కోటకదిర శివారు మన్యంకొండ సమీపంలో బుధవారం రైలింజన్ పట్టాలు తప్పింది. మహబూబ్‌నగర్ నుంచి మన్యంకొండ స్టేజి వరకు రైల్వేట్రాక్ పట్టాల మరమ్మతుల పర్యావేక్షణ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మరమ్మతులు చేస్తున్న సమయంలో రైలింజన్ అకస్మాత్తుగా పట్టాలుతప్పడం జరిగింది. దాంతో హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, రాయలసీమ నుండి హైదరాబాద్‌కు వచ్చే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుంగభద్ర, గుంటూరు ఎక్స్‌ప్రేస్, కర్నూల్ ఫ్యాసింజర్, గుంటూర్ ఫ్యాసింజర్, రాయిచూర్ డెమో రైళ్లు దేవరకద్ర స్టేషన్‌లోనే సాయంత్రం 5.30 గంటల నుండి ఒకదాని వెంట ఒకటి నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర అవస్తలు పడ్డారు. రాత్రి పొద్దుపోయే వరకు ఇంకా పట్టాలు తప్పిన మరమ్మతు రైలు అక్కడే ఉండడంతో ప్రయాణికలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఘటన స్థలానికి రైల్వే అధికారులు వచ్చి పరిశీలించారు. సికింద్రబాద్ నుండి ప్రత్యేకంగా ఓ రైలింజన్ వచ్చాకే పట్టాలు తప్పిన రైలును తీసే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
*చిత్రం...మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ సమీపంలో పట్టాలు తప్పిన మరమ్మతు చేసే రైలింజన్