జాతీయ వార్తలు

చైనా అధ్యక్షుడి భారత పర్యటన ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఇంతవరకు సందిగ్ధంలో ఉన్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత్ పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. ఈనెల 11, 12 తేదీల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చెన్నై సమీపంలోని మామల్లాపురంలో పర్యటిస్తారని భారత విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. కేవలం 50 గంటల ముందు మాత్రమే చైనా అధ్యక్షుడి పర్యటన అధికారికంగా ఖరారు కావడం విశేషం. ఈమేరకు తమిళనాడులోని మామల్లాపురంలో చైనా అధ్యక్షుడి పర్యటనకు సంబంధించి విస్తృత ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. రెండు రోజుల పర్యటనలో జీ జిన్‌పింగ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇరు దేశాల విదేశాంగ శాఖల మంత్రులు, ఇతర అధికారులతో భేటీ అవుతారు. అనేక ద్వైపాక్షిక అంశాలు ఇరు దేశాల నేతల శిఖరాగ్ర భేటీలో చర్చకు వస్తాయని తెలుస్తోంది. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేయడంతో పాటు జమ్మూ కాశ్మీర్, లడక్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని చైనా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జీ జిన్‌పింగ్ భారత్ పర్యటన ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకొంది. ఇరు దేశాలకు సంబంధించిన దైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించడమే కాకుండా.. ప్రాంతీయ, విదేశీ అంశాలపై కూడా కూడా కూలంకషంగా భేటీలో చర్చకు రానున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దుతో పాటు భారత రాజ్యాంగం, సార్వభౌమాధికార అంశాలపై ఎలాంటి చర్చలు ఈ శిఖరాగ్ర భేటీలో ఉండబోవని.. ఈ విషయంలో దేశ వైఖరి సుస్పష్టమేనని విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు.
ఒకవేళ జీజిన్‌పింగ్ ఈ అంశంపై ఏమైనా ఆసక్తి కనబరిస్తే మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ దేశ వైఖరిని కరాఖండీగా తెలియజేస్తారని పేర్కొన్నారు. లడక్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన అంశంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే.. అది స్థానిక ప్రజల డిమాండ్ అనీ.. ఇరు దేశాల సరిహద్దు వ్యవహారంలో తీసుకొన్న నిర్ణయాలపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చైనా బృందానికి భారత్ స్పష్టం చేయనున్నట్లు సమాచారం. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చైనా పర్యటన అనంతరం జరుగుతున్న చైనా అధ్యక్షుడి పర్యటనకు సంబంధించి ‘ఈ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక అంశంగానే పరిగణిస్తామని’ పాక్‌తో సంబంధాల అంశాన్ని ప్రస్తావనకు తెచ్చే ఎలాంటి ప్రయత్నం భారత్ చేయబోదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమై.. అభివృద్ధి దిశగా అడుగులు పడాలన్నదే ఇరు దేశాల శిఖరాగ్ర భేటీ ప్రధాన ఉద్దేశంగా ఉంటుందని అధికారులు వివరించారు.
*చిత్రాలు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ శిఖరాగ్ర సమావేశం కోసం
ముస్తాబవుతున్న తమిళనాడులోని మామల్లాపురం (మహాబలిపురం)