జాతీయ వార్తలు

ఆరోగ్యానికి పట్టం కట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఆరోగ్య రంగానికి కనీసం ఎనిమిది శాతం బడ్జెట్‌లో కేటాయించే విధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ పిలుపునిచ్చారు. తద్వారా 2025 నాటికి స్థూల జాతీయోత్పత్తిలో 2.5 శాతం లక్ష్యం సాధించడానికి వీలు కలుగుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో గురువారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కేంద్ర కౌన్సిల్ (సీసీహెచ్‌డబ్ల్యు) 13వ వార్షిక సమావేశాలను మంత్రి హర్షవర్దన్ ప్రారంభించారు. ‘ఆరోగ్య రంగంలో ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తున్నాం.. ముఖ్యంగా పోలియో రహిత భారత్‌ను సాధించగలిగాం.. అన్ని రాష్ట్రాల సంపూర్ణ సహకారంతో ఈ రంగానికి కనీసం ఎనిమిది శాతం నిధులు కేటాయిస్తే 2025 నాటికి జీడీపీ 2.5 శాతం లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోగలం.. ఇదేమీ అసాధ్యం కాదు’ అని మంత్రి స్పష్టం చేశారు. ఈ వార్షిక సమావేశాలకు 13 రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు హాజరయ్యారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా జాతీయ ఆరోగ్య ప్రాధాన్య అంశంలో ఏకాభిప్రాయం సాధించడమే ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. క్షయ వ్యాధిని పూర్తిగా పారదోలే విధంగా చూడడంతో పాటు వైద్య రంగంలో వౌలిక సదుపాయాల కల్పన ముఖ్య అజెండాగా భావిస్తున్నట్లు చెప్పారు. జాతీయ ఆరోగ్య విధానం 2017 ప్రకారం ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా 2025 నాటికి 2.5 శాతం లక్ష్యం సాధించగలమని చెప్పారు. దీనికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పూర్తి సహకారం అవసరమని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఆరోగ్య అవసరాలు సామాజిక ఉద్యమంగా భానావించడమే కాకుండా ‘ఈట్ రైట్.. ఫిట్ ఇండియా’ ఉద్యమాన్ని కూడా చేపట్టాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మంత్రి పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాలు సైతం అనుసరించే విధంగా ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అధిక శాతం నిధులు కేటాయించాలని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని కోరారు.

*చిత్రం... కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్