జాతీయ వార్తలు

కేంద్ర మంత్రి చూబేపై ఇంక్ బాటిల్ విసిరాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, అక్టోబర్ 15: కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చూబేకు బిహార్ రాజధాని పాట్నాలో చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం పాట్నా వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీకి విచ్చేసిన ఆరోగ్య శాఖ సహాయ మంత్రి చూబేపై కారుపై ఇంక్ బాటిల్‌ను విసిరేశాడు.
దీంతో ఆయన దుస్తులు, కారు బాయ్‌నెట్‌పై ఇంక్ మరకలు పడడం పాట్నాలో సంచలనం రేపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డెంగ్యూ బాధితులను పరిశీలించేందుకు మంత్రి చూబే విచ్చేశారు. డ్రైవర్ పక్క సీట్లో కూర్చొన్న మంత్రి డోర్ డెరిచి ఆసుపత్రి లోపలకు వచ్చే సందర్భంలో కొంతమంది ఆందోళనకారులు చుట్టుముట్టారు. వారిలో నీలి రంగు టీషర్టు వేసుకొన్న ఓ వ్యక్తి మంత్రిపైకి ఇంక్ బాటిల్ విసిరాడు. ఒక్కసారిగా అనూహ్య పరిణామం ఎదురు కావడంతో ముందు మంత్రి షాక్‌కు గురయ్యారు. ఆయన వేసుకొన్న కుర్తాతో పాటు, స్లీవ్‌లెస్ జాకెట్‌పైన, కారు బాయ్‌నెట్, విండోలపై కూడా ఇంకు మరకలు పడ్డాయి. కేవలం కొద్దిపాటి దూరం నుంచే ఆందోళనకారుడు ఇంక్ బాటిల్ విసరడం చర్చనీయాంశమైంది. ఇంకు మరకలతోనే మంత్రి చూబే విలేఖరులతో మాట్లాడారు. ‘ప్రజాస్వామ్య వ్యతిరేకులు ఇలాంటి చర్యలకు పాల్పడడం శోచనీయం.. రాజకీయాల్లోకి ఇంకా రాకుండానే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే వచ్చిన తరువాత పరిస్థితి ఏవిధంగా ఉంటుంది’ అని ప్రశ్నించారు. మంత్రి పేర్లు వెల్లడించకపోయినా వివాదాస్పద రాజకీయ నాయకుడు, జన్ అదికార పార్టీకి చెందిన రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యావద్‌ను ఉటంకిస్తూనే ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలి వరదలతో అతలాకుతలమైన బిహార్ రాజధాని పాట్నాపై ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందనీ.. దీనిని వ్యతిరేకిస్తూనే ఆందోళనకారుడు ఈవిధమైన చర్యకు పాల్పడినట్లు సమాచారం. వర్షాలతో అతలాకుతలమైన పాట్నాలో నడుం లోతులో నీటిలో వారం రోజుల పాటు ఎంతో ఇబ్బందులు పడినా ఎవరూ పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ.. సుమారు 20 సంవత్సరాల వయస్సు కలిగిన నిషాంత్ ఝా అనే వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తేలింది. ఇతన్ని జన్ అధికార్ పార్టీ కార్యకర్తగా గుర్తించారు.