జాతీయ వార్తలు

బీజేపీ చేతిలో కీలుబొమ్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, అక్టోబర్ 15: కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయాయని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ విమర్శించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చేసుకుని దుర్వినియోగం చేస్తోందని మంగళవారం ఇక్కడ ఆరోపించారు. మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే శివకుమార్ అరెస్టుపై వేణుగోపాల్ తీవ్రంగా స్పందించారు.‘ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ బీజేపీ డ్రామాలు మొదలెడుతోంది. ఐటీ, ఈడీని దాడులకు ఉసిగొల్పుతోంది. జాతీయ సంస్థలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయాయి’అని ఆయన విమర్శించారు. 21న ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ నిర్వహించిన పార్టీ ఎన్నికల పరిశీలకుల సమావేశంలో వేణుగోపాల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు, పలువురు సీనియర్ నేతలు సమావేశానికి హాజరయ్యారు. అనర్హత ఎమ్మెల్యేల స్థానాలైన 15 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హతవేటు పడగా అందులో 14 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్‌కు చెందినవారున్నారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరపై ఇటీవలే ఐటీ దాడులు జరిగాయి. ఆయన విద్యాసంస్థల్లో ఎంబీబీఎస్ ప్రవేశాల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలొచ్చాయి. పరమేశ్వరకు సిద్ధార్థ విద్యా సంస్థలున్నాయి. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత జాలప్ప కుమారుడి విద్యాసంస్థలపైనా ఐటీ దాడులు జరిగాయి. బీజేపీ నాయకులపై లెక్కకుమిక్కిలిగా సీబీఐ, ఐటీ, ఈడీ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వాటికి కోల్డ్ స్టోరేజీలో ఉంచారని వేణుగోపాల్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులపైనే కక్షగట్టి దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాగోలా లబ్ధిపొందాలన్న దురాలోచనతోనే కీలబొమ్మ సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆయన అన్నారు. కర్నాటకలో ఉప ఎన్నికలు జరిగే 15 నియోజకవర్గాల్లోనూ తామే గెలుస్తామన్న విశ్వాసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వ్యక్తం చేశారు.