జాతీయ వార్తలు

మహిళల భద్రతకు కార్పొరేట్లు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 15: కార్పొరేట్ సెక్టార్‌లో మహిళల హక్కుల పరిరక్షణకు మరిన్ని చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. మహిళలు, ఆడపిల్లల భద్రతకు ఇప్పటికే అనేక చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చిందని.. దీని ద్వారా వారికి సత్వర న్యాయం జరిగేందుకు దోహదపడుతోందని వివరించారు. ‘కార్పొరేట్ సెక్టార్‌లో ప్రభుత్వ పాలసీలను మహిళలకు వర్తింప చేయడం ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది’ అని మంగళవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఇందుకు కార్పొరేట్ సంస్థలు మహిళలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణకు అనేక చర్యలను ప్రభుత్వం చేపట్టిందనీ.. అలాగే, మెటర్నటీ / పెటర్నటీ లీవులను మరింతగా పొడిగించే దిశగా కూడా చర్యలను తీసుకొన్నామని స్పష్టం చేశారు. మహిళలు పదోన్నతి విషయంలో ఎలాంటి అసంతృప్తికి లోనై.. ఉద్యోగాలను వీడే యోచనకు రాకుండా చూడాల్సిన బాధ్యత కంపెనీలపై ఉంటుందని పేర్కొన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో మహిళలకు ఉద్యోగ భద్రత విషయంలో కార్మిక చట్టాలు పకడ్బందీగా ఉన్నాయని చెప్పారు. మహిళలు, పిల్లల భద్రత అంశం అనేది ఏ ఒక్క దేశానికే పరిమితం కాదని అంటూ.. పనిచేసే ప్రాంతాల్లో లైంగిక నేరాల నుంచి రక్షణకు కేంద్రం చట్టాలను రూపొందించిందని స్మృతి ఇరానీ వివరించారు. ‘బాలలు అశ్లీల వ్యవహారాలు, ముఖ్యంగా ఆన్‌లైన్‌లో అశ్లీలాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెబుతూ దేశంలోనే మొట్టమొదటగా కేంద్ర ప్రభుత్వం చట్టానికి రూపకల్పన చేసింది’ అని స్మృతి ఇరానీ పేర్కొన్నారు.
ఈ విషయంలో పార్టీలకు అతీతంగా మహిళలు, బాలల భద్రతకు, హక్కుల పరిరక్షణకు అంతా కలిసి రావాలని పిలుపునిచ్చామనీ.. గత ఐదేళ్లలో సత్ఫలితాలు సాధించగలిగామని ఇరానీ స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ‘ముద్ర’ పథకం ద్వారా రుణాలు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొందని చెప్పారు. 200 మిలియన్ల మందికి ముద్ర రుణాలు మంజూరు చేయగా ఇందులో 70 శాతం మంది మహిళలే కావడం విశేషమని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు.

*చిత్రం... కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ