జాతీయ వార్తలు

అయనా..చైనా మారలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: చైనా తన తీరును మార్చుకోలేదు. ఉరీ ఉగ్రవాద దాడి తరువాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ జరిపిన సర్జికల్ దాడులను యావత్ప్రపంచం సమర్థిస్తుంటే, చైనా మాత్రం పాకిస్తాన్‌లోని టెర్రరిస్టులను రక్షించటం మాత్రం మానలేదు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైష్ ఏ మహమ్మద్ నేత మసూద్ అజర్‌పై నిషేధం విధించాలన్న భారత ప్రతిపాదనకు చైనా మళ్లీ మోకాలడ్డింది. ‘టెక్నికల్ హోల్డ్’ అంటూ సాంకేతిక కారణాలు చూపించి భద్రతామండలి 1267 కమిటీలో మరో మూడు నెలల పాటు నిర్ణయం తీసుకోకుండా వీటో చేసింది. జైష్ ఎ మహమ్మద్ సంస్థ ఇప్పటికే ఉగ్రవాద సంస్థల జాబితాలో ఉంది. ఓ వైపు అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, భారత్ సహా 14 ఇతర దేశాలు మసూద్‌పై నిషేధం విధిస్తుంటే, చైనా ఒక్కటే అసాధారణ రీతిలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ‘హోల్డ్’పేరుతో నిలిపించింది. మసూద్ అజర్‌పై నిషేధం విధించటంలో సహకరించాలంటూ చైనాతో గత ఆరు నెలలుగా భారత్ లాబీయింగ్ చేస్తూనే ఉంది. అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. గత మార్చిలో భద్రతామండలిలో చైనా పేర్కొన్న ‘హోల్డ్’ గడువు మరి కొద్ది గంటల్లో ముగిసిపోతుందనగా దీన్ని మరో మూడు నెలల పాటు చైనా పొడిగించింది.

చిత్రం.. మసూద్ అజర్