జాతీయ వార్తలు

ప్రధానిని కలిసిన గవర్నర్ తమిళిసై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ, సామాజిక పరిస్థితులు, ముఖ్యం గా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిబ్బంది చేస్తున్న సమ్మె గురించి వివరించినట్లు తెలిసింది. గవర్నర్ తమిళిసై మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు లోకకళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లి దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు చర్చలు జరిపారు. టీఎస్ ఆర్టీసీ
ఉద్యోగులు గత పది రోజుల నుంచి చేస్తున్న సమ్మె మూలంగా సమాజంపై పడుతున్న ప్రతికూల ప్రభావం, సామాన్య జనంతోపాటు ఉద్యోగులు, విద్యార్థులు పడుతున్న అవస్థలు కూడా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఆర్టీసీ సమ్మె ప్రభావం, సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం గురించి వివరించినట్లు తెలిసింది. కెనడాలో సమ్మెకు దిగిన ఉద్యోగులు తమంటమ తాము ముందుకు వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరపటం గురించి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేసిన ప్రస్తావన, కెనడా పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం కూడా టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలు జరపకూడదని రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయించటం.. దాని మూలంగా ప్రజలపై పడుతున్న ప్రభావం గురించి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారని అంటున్నారు. కొత్త సవిచాలయం నిర్మాణం కోసం పాత సచివాలయ భవనాల కూల్చివేతపై రాష్ట్ర హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాల గురించి కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం పని తీరు, తదితర అంశాలు కూడా పరిశీలనకు వచ్చాయనే మాట వినిపిస్తోంది. ఇదిలాఉంటే గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ హోం శాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిసి చర్చలు జరిపినట్లు తెలిసింది.
*చిత్రం...ప్రధానిని కలిసిన గవర్నర్ తమిళిసై