జాతీయ వార్తలు

షార్‌లో కుప్పకూలిన ప్లాట్‌ఫారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, అక్టోబర్ 15: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లో సోమవారం రాత్రి రెండవ వాహన అనుసంధాన భవనం ఎస్‌వీఏబీలో ప్రమాదం చోటుచేసుకుంది. షార్‌లో చేపట్టే నిర్మాణ విషయాల్లో విధులు నిర్వహించే ఇంజనీర్లు నైపుణ్య విషయంలో ఎక్కడా రాజీ పడరని ఓ గట్టి నమ్మకం. అయితే దీనికి విరుద్ధంగా షార్‌లో రాకెట్ విడిభాగాలను అనుసంధానం చేసేందుకు నిర్మించిన భవనంలోని రెండు రివాల్వింగ్ ప్లాట్‌ఫారాలు ప్రారంభించిన మూడు నెలల్లోనే కుప్పకూలిపోయి వాటి నిర్మాణ విషయంలో ఇంజనీర్ల పనితీరును బయటపెట్టాయి. షార్ కేంద్రంలో రెండవ వాహన అనుసంధాన భవనంలో ప్లాట్‌ఫారాలు సోమవారం సాయంత్రం హఠాత్తుగా కుప్పకూలాయి. అదే సమయంలో రివాల్వింగ్ ప్లాట్‌ఫారాలకు సర్వీసింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని సమాచారం. సుమారు మూడు కోట్ల మేర భారీ వ్యయంతో నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది. ఈ భవనాన్ని భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ జూలై 14న ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రారంభించి మూడు నెలలు కాకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం అందరినీ కలవరపరుస్తోంది. ఈ ప్లాట్‌ఫాం బరువు ఒక్కొక్కటి సుమారు 20 టన్నులు ఉంటుంది. ఈ భవనంలోని రెండవ రివాల్వింగ్ ప్లాట్‌ఫాం కూలి ఒకటవ ప్లాట్‌ఫాంపై పడటంతో రెండు ప్లాట్‌ఫారాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఘటన జరిగిన సమయంలో సిబ్బంది అక్కడ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటన సమాచారం తెలిసి షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్, ప్రాజెక్టు డైరెక్టర్ కుంభకర్ణన్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై వివరాలను ఆరా తీశారు. పూర్తిస్థాయిలో వివరాలు తీసుకునేందుకు వైఫల్యాల కమిటీని నియమించినట్లు విశ్వసనీయ సమాచారం.