జాతీయ వార్తలు

కేసుల సంఖ్యను తగ్గించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: కోర్టుల్లో పేరుకుపోతున్న కేసుల సంఖ్యను తగ్గించటంలో న్యాయవాదుల పాత్ర కీలకమని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. బుధవారం ఆయన నివాసంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో బెంగళూరులోని పీఎస్‌ఈ విశ్వవిద్యాలయం న్యాయ విద్యార్థులతో సమావేశమయ్యారు. రాజ్యాంగ నిబంధనలను పాటిస్తూనే కేసుల విచారణను అనవసరంగా సాగదీయకుండా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. కేసుల సంఖ్య పెరిగిపోవటం వలన న్యాయ ప్రక్రియ ఆలస్యమవుతోంది.. ఇది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాలను ప్రోత్సహించటం ద్వారా పెండింగ్ కేసులను తగ్గించేందుకు వీలున్నదని ఆయన సూచించారు. స్థానిక హైకోర్టుల్లో మాతృభాషలోనే వాదనలు వినిపించాలని వెంకయ్య నాయుడు న్యాయ విద్యార్థులకు హితవు చెప్పారు. యాంటీ డంపింగ్, మేథో సంపత్తి హక్కుల ఉల్లంఘన, ట్రేడ్ మార్క్ తదితర కొత్త అంశాలపై దృష్టి పెట్టాలని అన్నారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి భారతదేశం కేంద్రంగా మారుతున్న ఈ తరుణంలో న్యాయ విద్యార్థులు వివిధ దేశాలలోని న్యాయపరమైన అంశాలను అధ్యయనం చేయాలని అన్నారు. దీనితోపాటు అంతర్జాతీయ చట్టాలను కూడా బాగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నదని వెంకయ్య నాయుడు సూచించారు. ఇదిలాఉంటే ప్రముఖ సినీ నటుడు చిరంజీవి బుధవారం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులకు సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ప్రదర్శించారు. చిరంజీవి ఒకటి, రెండు రోజులు ఢిల్లీలోనే ఉండి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలను కలుసుకుంటారని తెలిసింది.