జాతీయ వార్తలు

దుందుడుకు చర్యలు ఇక కట్టిపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: పాకిస్తాన్ ఇక మీదట ఎప్పుడు దుందుడుగా వ్యవహరించినా గట్టిగా బుద్ధి చెపుతామని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ హెచ్చరించారు. భారత సైన్యానికి చెందిన ప్రత్యేక కమాండో దళాలు అక్రమిత కాశ్మీర్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదులు, వారికి రక్షణ కల్పిస్తున్న వారిని హతమార్చి వచ్చిన తరువాత మొదటిసారి మనోహర్ పారికర్ శనివారం విలేఖరులతో ముచ్చటించారు. ఉగ్రవాదులకు చెందిన ఎనిమిది లాండ్‌ప్యాడ్‌లను ధ్వంసం చేసి వచ్చిన ప్రత్యేక దళాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. భారత దేశానికి ఎవరు నష్టం కలిగించినా ఈ విధంగానే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇతర దేశాలను అక్రమించుకోవాలనే కోరిక తమకు లేదంటూ, రామాయణ కథను ప్రస్తావించారు. శ్రీరాముడు శ్రీలంకను గెలుచుకున్న తరువాత దానిని విభీషణుడికి ఇచ్చి వేశారు, అలాగే మనం కూడా బాంగ్లాదేశ్ విషయంలో వ్యవహరించామని ఉద్ఘాటించారు. ఉరీలాంటి సంఘటనకు పాల్పడే ముందు ఉగ్రవాదులు ఇక ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. భారత సైన్యం సర్జికల్ దాడులు చేయలేదంటూ పాకిస్తాన్ చేస్తున్న ప్రచారం గురించి ప్రశ్నించగా, ప్రత్యేక దళాలు ఎప్పుడు, ఎలా ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొచ్చుకుపోయి తమ పని ముగించుకు వచ్చాయనేది వారికి ఇంకా అర్థం కాలేదని, అందుకే అలా బుకాయిస్తున్నారని పారికర్ ఎద్దేవా చేశారు. సర్జరీ అయన తరువాత మనుషులు కోమాలోకి వెళ్లినట్లే, సర్జికల్ దాడుల తరువాత పాకిస్తాన్ కూడా కోమాలోకి వెళ్లిపోయిందని అన్నారు. లంకకు వెళ్లేంతవరకు హనుమంతుడికి తన తన బలం గురించి తెలియదు, అదే విధంగా మన దళాలకు కూడా అక్రమిత కాశ్మీర్‌లో సర్జరీ దాడులు చేసిన తరువాతనే తమ నిజమైన బలాన్ని గ్రహించాయని మనోహర్ పారికర్ చెప్పారు. ప్రధాన మంత్రి ఆదేశం మేరకు మన ప్రత్యేక దళాలు ఉగ్రవాదుల భరతం పట్టాయని ఆయన ప్రశంసించారు. పాకిస్తాన్ ఇలాగే కుట్రలు చేస్తూపోతే తగిన విధంగా గుణపాఠం నేర్పిస్తామని ఆయన మరోసారి హెచ్చరించారు.