జాతీయ వార్తలు

హస్తిన రోడ్లకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: నిత్యం వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ అయ్యే హస్తినలోని రోడ్లకు రీ-డిజైన్ చేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. తమ ప్రణాళికతో రోడ్లపై ఏ మాత్రం ట్రాఫిక్ జామ్ కాకుండా పూర్తిగా నియంత్రించేందుకు అవకాశం ఉందని కేజ్రీవాల్ బుధవారం అసొచం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. వచ్చే ఐదేళ్ళలో ఢిల్లీ ప్రజలకు నిరంతరం నీటి సరఫరా చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఢిల్లీలోని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న మూడు లేన్ల, నాలుగు లేన్ల రోడ్లను ఆరు లేన్లకు విస్తరిస్తామని ఆయన వివరించారు. రోడ్లను పూర్తిగా రీ-డిజైన్ చేస్తే తప్ప ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించలేమన్నారు. ప్రైవేటు కార్లను, వాహనాలను తగ్గించి, ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను తీసుకెళ్ళేందుకు వీలుగా బస్సులను, ఇతరత్రా వాహనాలను సమకూర్చనున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఆ విధమైన సౌకర్యాన్ని కల్పించినట్లయితే ప్రజలు తమ కార్లను, బైక్‌లను వినియోగించరని ఆయన చెప్పారు. ఈ విధంగా ఢిల్లీ రోడ్లకు మహర్ధశ కల్పించేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవార్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.