జాతీయ వార్తలు

వ్యవసాయ వ్యర్థాలతో బయో-ఇటుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (ఐఐటీ) పరిశోధకులు వ్యవసాయ వ్యర్థ పదార్థాలను ఉపయోగించి ఇటుకలను (బయో-బ్రిక్స్) తయారు చేశారు. మామూలు ఇటుకల మాదిరిగానే వీటిని నిర్మాణాలకు ఉపయోగించుకోవచ్చు. భువనేశ్వర్‌లోని కేఐఐటీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌తో కలిసి ఐఐటీ హైదరాబాద్ బృందం ఈ బయో-ఇటుకలను ఆవిష్కరించింది. వ్యర్థాల నిర్వహణతో పాటు పర్యావరణ అనుకూల, రక్షణీయ నిర్మాణ సామగ్రి తయారీ అనే రెండు ప్రయోజనాలు లక్ష్యంగా వారు బయో-ఇటుకలకు రూపకల్పన చేశారు. నూతన బయో-ఇటుకలను ఆవిష్కరించినందుకు గాను ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన పరిశోధక విద్యార్థి ప్రియబ్రత రౌట్రాయ్, కేఐఐటీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అవిక్ రాయ్ ప్రత్యేక గుర్తింపు పొందారు. జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతి రాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ‘రూరల్ ఇన్నోవేటర్స్ స్టార్టప్ కాన్‌క్లేవ్ 2019’లో వీరిద్దరు ‘స్పెషల్ రికగ్నీషన్ ట్రోఫి ఫర్ సస్టెయినబుల్ హౌసింగ్’ను స్వీకరించారు. ‘్భరత దేశంలో ప్రతి సంవత్సరం వెలువడుతున్న మొత్తం కార్బన్ డయాక్సైడ్ (సీఓ2) ఉద్గారాలలో 22 శాతం నిర్మాణ రంగానికి చెందినవే. ఉదాహరణకు మట్టి ఇటుకల తయారీకి సారవంతమయిన పైమట్టిని ఉపయోగించడంతో పాటు తయారీ ప్రక్రియలో వాతావరణంలోకి పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. మరోవైపు, భారత్‌లో వ్యవసాయ వ్యర్థాలు అనేవి ముఖ్యమయినవి. దేశంలో ప్రతి సంవత్సరం 500 మిలియన్ టన్నుల వ్యవసాయ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో కొంత మొత్తాన్ని పశుగ్రాసం కోసం ఉపయోగిస్తున్నారు. 84 మిలియన్ టన్నుల నుంచి 141 మిలియన్ టన్నుల వరకు వ్యర్థాలను దహనం చేస్తున్నారు. దీనివల్ల విపరీతమయిన గాలి కాలుష్యం సంభవిస్తోంది’ అని రౌట్రాయ్ పేర్కొన్నారు.