జాతీయ వార్తలు

మోదీ పర్యటనతో విపక్షాల బెంబేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 16: మహారాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (17న) ప్రచారం చేయనున్నందున బెంబేలెత్తుతున్న ప్రతిపక్షాల నాయకులు చెట్ల నరికి వేతను రచ్చ, రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ విమర్శించారు. పుణేలోని సర్ పరశురామ్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని ఆయన బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. ప్రధాని పాల్గొనే సభ వద్ద దట్టమైన చెట్లు పెరిగి ఉండడం వల్ల వాటి కొమ్మలను నరికి వేయడం జరిగిందన్నారు. అంతేతప్ప పూర్తిగా చెట్లను తొలగించలేదన్నారు. సాధారణంగా వీవీఐపిలు పాల్గొనే వేదికల వద్ద చెట్లు పెరిగి ఉంటే వాటి కొమ్మలను నరికి వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. లోగడ కూడా ఇలాంటి పద్ధతులనే అనుసరించడం జరిగిందని ఆయన వివరించారు. చెట్లను నరికి వేస్తే అంతకు రెట్టింపుగా మొక్కలు నాటడం అనేది అటవీ సంరక్షణ చట్టంలో నిబంధన స్పష్టంగా ఉందన్నారు. ఇంత దానికే ప్రతిపక్షాలు రచ్చ ఎందుకు చేస్తున్నాయో అర్థం కావడం లేదని కేంద్ర మంత్రి జవడేకర్ అన్నారు. మహారాష్టల్రో రైతు ఆత్మహత్య చేసుకోవడం గురించి విలేఖరులు ప్రశ్నించగా, గత కాంగ్రెస్-ఎన్‌సీపి ప్రభుత్వ హయాంతో పోలీస్తే చాలా తగ్గాయన్నారు. మహారాష్టల్రోని 5 జిల్లాల్లో సాగు నీటి సౌకర్యం కొరత ఉండడం వల్ల రైతులు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయని ఆయన తెలిపారు. పంజాబ్-మహారాష్ట్ర సహకార బ్యాంకు (పీఎంసీ) సంక్షోభం కారణంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎన్‌సీపీ చేసిన ఆరోపణను ఆయన ఖండించారు. పీఎంసీ సంక్షోభానికి ఎన్‌సీపీ కారణమని జవడేకర్ విమర్శించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆర్‌బీఐ తాజాగా అడ్మినిస్ట్రేటర్‌ను నియమించిందని ఆయన గుర్తు చేశారు.

*చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్