జాతీయ వార్తలు

సుప్రీం తీర్పే శిరోధార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం వెలువరించే తీర్పునకు ఉభయ పక్షాలు కట్టుబడి ఉండాలని ముస్లిం మేధావులు, నాయకులు స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉన్నా తమకు ఆమోదయోగ్యమేనని వారు ప్రకటించారు. అలాగే ఉభయ పార్టీలూ దానికి అనుగుణంగా నడచుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై విచారణ అక్టోబర్ 18న ముగిస్తామని ప్రకటించిన రాజ్యాంగ ధర్మాసనం ఒక రోజు ముందుకు అంటే 17వ తేదీకి పొడిగించింది. అయితే దానికి ముందు రోజే వాదోపవాదాలు పూర్తికావడంతో బుధవారం సాయంత్రం 4 గంటలకే విచారణ ముగించినట్టు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రకటించారు. రాజకీయంగా అంత్యంత సున్నితమైన 2.7 ఎకరాల అయోధ్య స్థల వివాదంపై రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. దైనందిన పద్ధతిపై విచారణ జరిపింది. సుమారు 40 రోజుల పాటు కేసు విచారణ సాగింది. సుప్రీం విచారణ తీరుపై ఆల్ ఇండియా ఉలేమా కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి వౌలానా మెహబూబ్ డ్రయాడీ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ విచారణ పూర్తయిందన్న వార్త మాకెంతో సంతోషం కలిగించింది. తుది తీర్పుకోసమే ఎదురుచూస్తున్నాం. మతపరంగా కాకుండా సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకుని ధర్మాసనం తీర్పును వెలువరిస్తుందని నమ్ముతున్నాం’అని ఆయన అన్నారు. సుప్రీం కోర్టు తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని మొదటి నుంచీ చెబుతున్నామని వౌలానా పేర్కొన్నారు. తమ వరకైతే స్పష్టంగానే ఉన్నామని, అయితే అవతలి పక్షం కూడా కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. తుది తీర్పు వెలువడే పరిస్థితుల్లో ముస్లిం సమాజం శాంతి, సామరస్యాన్ని పాటించాలని ఉలేమా నేత పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు వౌలానా సయ్యద్ అథారలీ మాట్లాడుతూ రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయమే శిరోధార్యం అన్నారు. ‘ కేసుకు సంబంధించి మా వాదన గట్టిగానే వినిపించాం. సాక్ష్యాధారాలు కోర్టుకు అందజేశాం. ఆ తరువాత కోర్టు ఇష్టం. తీర్పు ఎలా ఉన్నా మేం గౌరవిస్తాం’అని ఆయన ప్రకటించారు. న్యాయస్థానంలో తామే గెలుస్తామన్న ధీమాను ఖోజా-షియా జమాత్ సీనియర్ సభ్యుడు షాబీర్ సోజీ వ్యక్తం చేశారు. ‘న్యాయవ్యవస్థపై మాకు గౌరవం ఉంది. కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటించినా మాకు సమ్మతమే’అని ఆయన వెల్లడించారు.
*చిత్రం...సుప్రీంకోర్టులో రామజన్మభూమి కేసు వాదనలు ముగిసిన తర్వాత బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కన్వీనర్, సీనియర్ అడ్వకేట్ జఫర్‌యబ్ జిలానీ