జాతీయ వార్తలు

శివాజీ ఆశయాలే మాకు స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సతారా (మహారాష్ట్ర), అక్టోబర్ 17: ఛత్రపతి శివాజీ జాతీయవాదం ఆయన అనుసరించిన భద్రతా వ్యూహాలను తమ ప్రభుత్వం అనుసరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌పై దుష్ట వ్యూహాలు పనే్న వారికి గట్టిగా జావాబు ఇచ్చే శక్తి భారత్‌కు ఉందని గురువారం నాడు ఇక్కడ జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో మోదీ అన్నారు. శివాజీ మహరాజ్ తరహాలోనే తమ ప్రభుత్వం రక్షణ దళాలను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దిందని మోదీ తెలిపారు. గత ఐదేళ్లుగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఛత్రపతి శివాజీ విలువలనే పాటిస్తూ వచ్చిందని, జాతీయ వాదానికి, జాతీ1య భద్రతకు ప్రాధాన్యత ఇచ్చిందని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. గతంలో వచ్చిన ఏ ప్రభుత్వం సాహసించని రీతిలో జాతీయ సమగ్రతలకు సంబంధించి ఎన్నో కఠిన నిర్ణయాలను కేంద్రంలోని తమ ప్రభుత్వం తీసుకోగలిగిందని మోదీ తెలిపారు. కాంగ్రెస్, ఎన్సీపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రధాని జాతీయ భద్రత, జాతీయ సమగ్రత కోసం తాము తీసుకున్న నిర్ణయాలను ఈ రెండు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. భారత్ సైన్యంలోని అత్యధిక సంఖ్యలో సైనికుల్ని పంపే సతారా జిల్లా ప్రజలకు ఈ రెండు పార్టీల నిర్ణయం వల్ల తీవ్ర మనస్తాపం కలిగిందన్నారు. అత్యధిక స్థాయిలో సైన్యాన్ని పంపే ప్రాంతంలో జాతీయ భద్రతను వ్యతిరేకించే వాడికి చోటే లేదని మోదీ అన్నారు. మన సైనికుల సాహస కృత్యాలనే ఈ రెండు పార్టీలు ప్రశ్నిస్తూ వస్తున్నాయని, అలాగే రాఫెల్ ఒప్పందాన్ని 370 అధికరణ రద్దును కూడా వ్యతిరేకించాయని మోదీ అన్నారు. ఇవన్నీ కూడా సతారా ప్రజలకు ఎంతో మనస్తాపాన్ని కలిగించే చర్యలని మోదీ తెలిపారు. ఈ రెండు పార్టీలకు జాతీయ మనోభావాలు అర్థం కావని పేర్కొన్న మోదీ ‘ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా ప్రజలు కూడా వీటికి ప్రతికూలంగా తీర్పును ఇవ్వబోతున్నారు అని మోదీ అన్నారు. సతారా జిల్లాను తన గురుభూమిగా అభివర్ణించిన మోదీ తన గురువు లక్ష్మణ్ ఇనమ్‌దార్ ఈ జిల్లాలోని కటావూ గ్రామానికి చెందిన వాడేనని మోదీ తెలిపారు. ఛత్రపతి శివాజీ వారసులందరూ బీజేపీలోనే ఉన్నారని మోదీ తెలిపారు. భారతదేశాన్ని అత్యున్నత సమైక్య దేశంగా నిలబెట్టాలన్న శివాజీ కలలను తమ ప్రభుత్వం సాకారం చేస్తోందని, ఆయన ఆదర్శాలు, సిద్ధాంతాల బలంతో మరింత ముందుకు వెళతామని తెలిపారు.
*చిత్రం...ప్రధాని నరేంద్ర మోదీకి వినాయకుని ప్రతిమను అందజేస్తున్న బీజేపీ కార్యకర్త
*ర్యాలీలో తనకు బహూకరించిన ఖడ్గాన్ని ప్రదర్శిస్తున్న ప్రధాని మోదీ