జాతీయ వార్తలు

మన కోణంలోనే చరిత్రను మళ్లీ రాయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, అక్టోబర్ 17: చరిత్రను భారత దృష్టి కోణం నుంచి తిరిగి రాయాల్సిన అవసరం ఎంతో ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. 1857లో జరిగిన తొలి స్వాతంత్య్ర సమరాన్ని ప్రస్తావించిన అమిత్ షా వీర్ సావర్కార్ లేకపోతే ఈ తొలి సమరం ఓ తిరుగుబాటుగానే ప్రచారంలోకి వచ్చి ఉండేదని అమిత్ షా అన్నా రు. 1857 నాటి ఆ పోరాటాన్ని తొలి స్వాతంత్య్ర సమరంగా పేర్కొన్న ఘనత వీర్ సావర్కార్‌దేనని అమిత్ షా శ్లాఘించారు. సవార్కర్‌కు భారతరత్న ఇవ్వాలన్న అంశంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో అమిత్ షా ఈ తొలి స్వాతం త్య్ర పోరాటాన్ని ప్రస్తావించారు. సవార్కర్ లేకపోతే బ్రిటీష్ పాలకుల కోణంలోనే 1857 నాటి ఆ పోరాటం వెలుగులోకి వచ్చేదని, చరిత్రలోనూ కలిసిపోయి ఉండేదని అన్నారు. అందుకే ఇలాంటి వక్రీకరణలకు ఆస్కారం లేకుండా చరిత్రను భారత దృష్టి కోణంలోనే తిరిగి రాయాల్సిన అవసరం ఉందన్నారు. 1857 తిరుగుబాటును తొలి స్వాతంత్య్ర సమరంగా పేర్కొన్న ఘన వీర్ సావర్కార్‌దేనని ఆయన అలా చెప్పి ఉండకపోతే భారత సంతతి దీన్ని తిరుగుబాటుగానే భావించి ఉండేదన్నారు. బనారస్ హిందూ యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమాన్ని గురువారం ఇక్కడ ప్రారంభించిన అనంతరం అమిత్ షా మాట్లాడారు. ఎవరినీ నిందించకుండా భారత దృష్టి కోణం నుంచే దేశ చరిత్రను రాయాలని, ఈ విషయంలో ప్రతీ ఒక్కరికీ ఎంతో బాధ్యత ఉందని అమిత్ షా తెలిపారు. వాస్తవాలను చారిత్రక సత్యాలను నిజాయితీగా వెలుగులోకి తేవాలని, అలాంటివి కాల పరీక్షకు నెగ్గుతాయని అమిత్ షా అన్నారు. చరిత్రకారులు ప్రాచీన భారత చరిత్ర గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి తేవాలని, స్కంధ గుప్తా, చంద్ర గుప్తా వంటి గొప్ప పాలకులకు సంబంధించి మరింతగా ప్రజలకు వివరాలు తెలియజేయాలని అమిత్ షా ఈ సందర్భంగా కోరారు. ప్రస్తుత చరిత్ర పుస్తకాల్లో ఇలాంటి గొప్ప పాలకులకు సంబంధించిన విషయాలు సంపూర్ణంగా లేవని, ఆ కొరతను నిపుణులు తీర్చాలని స్కంధ గుప్తుడి కాలంలోనే భారత సరిహద్దు అప్ఘానిస్తాన్ వరకు విస్తరించిందని, ఆ కాలంలోనే కళల స్వర్ణశకం రాణించిందని అమిత్ షా గుర్తు చేశారు. సాహిత్యమూ, సైనిక పాటవం, సంస్కృతీ అత్యున్నత ప్రమాణంలో ఉండేవని అమిత్ షా అన్నారు. ఆయన కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జ్యోతిష్యులు కూడా భారత్‌లో ఉండేవారని, కాశ్మీర్ నుంచి కాందహార్ వరకు దురాక్రమణుల జాడేలేదని తెలిపారు. స్కంధ గుప్తుడి తరహాలో దేశాన్ని పాలించిన ఎందరో గొప్ప పాలకుల గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి తేవాలని, ఈ కోణంలోనే దేశ చరిత్రను తిరిగి రాయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.

*చిత్రం... కేంద్ర హోం మంత్రి అమిత్ షా