జాతీయ వార్తలు

ప్రజల దృష్టిని మళ్లించడానికే ఎన్‌ఆర్‌సీపై కేంద్రం పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం, వృద్ధిరేటు మందగింపు వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్‌ఆర్‌సీ)పై కేంద్రం పట్టుబట్టి, దానినే ప్రధానాంశంగా ఎంచుకుందని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్కిస్ట్ (సీపీఎం) ఆరోపించింది. దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నదని, ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి విదేశీయులు చొరబడుతున్నారంటూ కేంద్రం రాద్ధాంతం చేస్తున్నదని విమర్శించింది. హిందూత్వ అజెండాను అమలు చేయడం ద్వారా, దేశంలో మత విద్వేషాలను కేంద్రంలోని మోదీ సర్కారు రెచ్చగొడుతున్నదని పేర్కొంది. ‘ఆర్థిక రంగం దారుణంగా దెబ్బతింటున్నది. నిరుద్యోగితా శాతం పెరుగుతున్నది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గుతున్నది. అందుకే దేశంలో శత్రులను వెతుక్కునే పనిలో పడింది’ అంటూ కేంద్ర సర్కారుపై విరుచుకుపడింది. విదేశాల నుంచి, ప్రధానంగా బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి చొరబడుతున్న ముస్లింలను వెనక్కు పంపడానికే ఎన్‌ఆర్‌సీని ప్రవేశపెట్టినట్టు చెప్తున్న కేంద్రం పౌరసత్వ చట్టాన్ని మార్చాలన్న ఆలోచన ఎందుకు చేస్తున్నదని సీపీ ఎం తన ప్రకటనలో ప్రశ్నించింది. వసల వెళ్లిన హిందువులకు కూడా దేశ పౌరసత్వాన్ని ఇవ్వడమే చట్ట సవరణ ప్రధాన లక్ష్యమని ఆరోపించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జనాభా గణన (ఎన్‌పీఆర్) ప్రక్రియ మొదలవుతుందని, ఈలోగా పౌరసత్వ చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం యోచిస్తున్నదని తెలిపింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లో మైనారిటీలుగా ఉన్న హిందువులు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినప్పటికీ, వారికి పౌరసత్వం ఇవ్వాలని మోదీ సర్కారు ఆలోచిస్తున్నదని సీపీఎం తెలిపింది. హిందూత్వ అజెండాను కేంద్రం అమలు చేస్తున్నదని, ఈ విధానాన్ని వెంటనే మార్చుకోవాలని తన ప్రకటనలో పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడి లో పెట్టేందుకు కృషి చేయాలని కేంద్రానికి హితవు పలికింది.