జాతీయ వార్తలు

నవంబర్ 18 నుంచి పార్లమెంటు సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 18న ప్రారంభమై నెల రోజుల పాటు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం శీతాకాల సమావేశాల్లో పలు ముఖ్యమైన బిల్లులను ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. వాటిలో ఉమ్మడి పౌర చట్టం బిల్లు ఉంటుందా? అనేది స్పష్టం కావటం లేదు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ అధ్యక్షతన బుధవారం రాత్రి జరిగిన కేంద్ర మంత్రివర్గం రాజకీయ వ్యవహారాల ఉపసంఘం సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. త్రిపుల్ తలాక్, జమ్ముకాశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగించి కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటం వంటి అత్యంత ముఖ్యమైన పనులను పూర్తి చేసిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఉమ్మడి పౌర చట్టాన్ని అమలు చేసే అంశంపై దృష్టి సారించిందని అంటున్నారు.
దేశంలో ఉమ్మడి పౌర చట్టాన్ని అమలు చేయాలని సుప్రీం కోర్టు 2015 అక్టోబర్‌లో స్పష్టం చేయటం తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి పౌర చట్టాన్ని అమలు చేయవలసిన అవసరం లేదని భారత లా కమిషన్ 2018 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఒక నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఉమ్మడి పౌర చట్టాన్ని అమలు చేయగలుగుతుందా? అనేది ప్రశ్న.