జాతీయ వార్తలు

ఏటా వంద కోట్ల టన్నుల ఆహారం వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ప్రపంచంలో 82 కోట్ల మంది ప్రజలకు కడుపునిండా తిండి ఉండడం లేదని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా ఒక బిలియన్ (వంద కోట్ల) టన్నుల ఆహార పదార్థాలు వృధా అవుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ‘ప్రపంచ ఆహార దినోత్సం’ సందర్భంగా ఐరాస ఓ సందేశం ఇచ్చింది. ఆ సందేశాన్ని గురువారం ఢిల్లీలో విడుదల చేశారు. ఓ పక్క మనుషులు తినడానికి తిండిదొరకడం లేదు, మరొపక్క టన్నుల కొద్దీ ఆహారం వృథా అవుతోందని అని ఆయన పేర్కొన్నారు. ఇది ఎంత మాత్రం సరైందికాదని ఆయన అన్నారు. జనం ఆకలితో అలమటిస్తుంటే చూస్తూ ఊరుకోవడమేనా?అని ఆయన ప్రశ్నించారు. రెండు బిలియన్ల మంది పురుషులు, స్ర్తిలు, చిన్నారులు ఊబకాయంతో బాధపడుతున్నారని ఆ ప్రకటనలో తెలిపారు. అధిక బరువులేదా ఊబకాయం బాధిస్తోందని అన్నారు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఐరాస ప్రధాన కార్యదర్శి చెప్పారు. జనం రోగాల బారిన పడుతూ ఒక్కోసారి మరణిస్తున్నారని ఆయన తెలిపారు. ‘మనం ఏం పండిస్తున్నాం? ఏది తీసుకుంటున్నాం? అన్నదానిపై ఆలోచించాలి. అలాగే గ్రీన్‌హౌస్ ఉద్గారాల తగ్గింపుపై దృష్టి సారించాలి’అని గుటెర్రెస్ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఆకలి లేని రాజ్యం రావాలని ఆయన ఆకాంక్షించారు. పౌష్టికాహారం అందరికీ అందుబాటులోకి రావాలని, ఎవరు ఎక్కడున్నా ఆహారం సరఫరా కావాలని ఐరాస చీఫ్ విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిలో ఆహార వ్యవస్థ కీలక భూమిక పోషిస్తుందన్న గుటెర్రెస్ ‘2021లో ఫుడ్ సిస్టమ్ సమ్మిట్’ ఏర్పాటు చేయాలన్న ఆశయంతో పనిచేస్తున్నట్టు ప్రకటించారు. మానవ మనుగడకు ఆహారం ఎంతో ముఖ్యమని, ప్రపంచాన్ని ఆకలి లేని రాజ్యంగా రూపొందించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులు ఆహార ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన హెచ్చరించారు. ఐరాస ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌ఏఓ) నివేదిక ప్రకారం పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిలో భారత్‌లో ఎక్కువ మంది ఉన్నారు. దేశ జనాభాలో 14.5 శాతం మందికి పోషకాహారం అందడం లేదు. 20.8 శాతం మంది పిల్లలు(5 ఏళ్లు) తగిన బరువు ఉండడం లేదు. అదే వయసు వారు 37.9 శాతం మంది ఎదుగుదల ఉండడం లేదు.