జాతీయ వార్తలు

ఆర్టికల్ 370 తప్ప సమస్యలు పట్టవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాసిక్, అక్టోబర్ 17: రాజ్యాంగంలోని అధికరణం 370ని పార్లమెంటు ఆగస్టులోనే రద్దు చేసిన తరువాత దమ్ముంటే ఆ అధికరణాన్ని పునరుద్ధరించాలని ప్రతిపక్షాలకు ఎందుకు సవాలు విసురుతున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నిలదీశారు. ఉత్తర మహారాష్టల్రోని నిఫద్‌లో నిర్వహించిన ఒక ఎన్నికల సభలో పవార్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, మాజీ ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ హయాంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులు దురవస్థకు చేరాయని నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుండగా బీజేపీ ఆర్టికల్ 370 గురించే నిరంతరం మాట్లాడుతోందని ఎందుకు మాట్లాడుతోందని పవార్ నిలదీశారు. సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ‘వారికి ఈ దేశ సంప్రదాయాలు తెలియవా? మేము విదేశాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రధాన మంత్రిని విమర్శించలేదు. వారు కూడా ఈ సంప్రదాయాన్ని పాటించాలి’ అని ఆయన అన్నారు. నిర్మలా సీతారామన్ అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో ప్రసంగిస్తూ మన్మోహన్ సింగ్, రఘురాం రాజన్‌లను విమర్శించడాన్ని పవార్ తప్పుబట్టారు.