జాతీయ వార్తలు

దేవీలాల్ ‘వారసత్వం’ కోసం పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: దేశ మాజీ ఉప ప్రధానమంత్రి దేవీలాల్ పురిటి గడ్డ హర్యానాలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాజకీయ వారసత్వం కోసం భీకర పోరు జరుగుతోంది. దేవీలాల్ కుటుంబ వారసుల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకోవడం వల్ల ఆయన స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) కొన్ని నెలల క్రితం నిలువునా చీలిపోయింది. ఇలా చీలిపోయిన దేవీలాల్ కుటుంబ సభ్యులు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాజకీయ వారసత్వాన్ని చేజిక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు. దేవీలాల్ ముని మనుమడు, యువ నాయకుడు దుష్యంత్ చౌతాలా ఈ ఎన్నికల్లో తన బాబాయిపై పైచేయి సాధించినట్టు కనపడుతోంది. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) ఈ ఎన్నికల్లో ఐఎన్‌ఎల్‌డీకి గతం లో పట్టున్న ప్రాంతాల్లో పాగా వేసినట్టు కనపడుతోంది. దుష్యంత్ బాబాయి అభయ్ చౌతాలా నేతృత్వంలోని ఐఎన్‌ఎల్‌డీని పక్కకు నెట్టి అనేక స్థానాల్లో జేజేపీ గట్టి పోటీని ఇస్తోంది. ఒకప్పుడు హర్యానాలో ప్రబల శక్తిగా ఉన్న ఐఎన్‌ఎల్‌డీ బలం ఇప్పుడు గణనీయంగా పడిపోయినట్టు కనిపిస్తోంది. దుష్యంత్ నేతృత్వంలోని జేజేపీ ఇప్పుడు అనేక స్థానాల్లో ఐఎన్‌ఎల్‌డీని పక్కకు నెట్టి మూడో పక్షంగా ముందుకు వచ్చినట్టు కనిపిస్తోంది. గతంలో ఐఎన్‌ఎల్‌డీ ప్రాబల్యం ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పుడు దేవీలాల్ రాజకీయ వారసత్వ ప్రతినిధిగా జేజేపీ ఆవిర్భవించింది. ఆ పార్టీకి ఓటర్ల నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. చౌతాలా కుటుంబంలో విభేదాల కారణంగా ఐఎన్‌ఎల్‌డీ నిలువునా చీలిపోయి, మాజీ హిస్సార్ ఎంపీ దుష్యంత్ చౌతాలా జననాయక్ జనతా పార్టీని ఏర్పాటు చేశారు. జననాయక్ అనేది దేవీలాల్‌కు ఉన్న పేరు ప్రతిష్టలకు అద్దం పడుతోంది. దుష్యంత్ తన ప్రసంగాలలో దేవీలాల్‌కు నిజమయిన రాజకీయ వారసుడిని తానేనని చెప్పుకుంటున్నారు. దేవీలాల్ గురించి, ఆయన రాజకీయ విధానాల గురించి దుష్యంత్ మాట్లాడుతున్నారు. అయితే, ఆయన ఏ సభలోనూ తన తాత ఓంప్రకాశ్ చౌతాలా పేరును ప్రస్తావించడం లేదు. ఎందుకంటే, రాజకీయ వారసత్వ పోరులో ఓం ప్రకాశ్ చౌతాలా తన బాబాయి అభయ్ చౌతాలాకు మద్దతిచ్చారని దుష్యంత్ ఆగ్రహంగా ఉన్నారు. అయితే, అదే సమయంలో దుష్యంత్ తన ప్రసంగాలలో ఎక్కడ కూడా వారిని విమర్శించడం లేదు. దేవీలాల్ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసికెళ్లే క్రమంలో దుష్యంత్ జింద్ జిల్లాలోని ఉచన కలాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సిటింగ్ ఎమ్మెల్యే ప్రేమలతతో తలపడుతున్నారు. మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు బీరేందర్ సింగ్ సతీమణి ప్రేమలత. ఉచనాకలాన్ నియోజకవర్గంలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో దుష్యంత్ తాత ఓం ప్రకాశ్ చౌతాలా బీరేందర్ సింగ్‌ను ఓడించారు.
*చిత్రం...దుష్యంత్ చౌతాలా