జాతీయ వార్తలు

బాపూజీ ఆశయ సాధనే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 17: తన స్వార్ధం కోసమే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇన్నాళ్లూ మనుగడ సాగించిందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ నిప్పులు చెరిగారు. దేశంలోనే అతిపురాతన పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ దాదాపుతెరమరుగైపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర బీజేపీ కార్యాలయంలో గురువారం గోయల్ మీడియాతో మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ కన్నకలలను సాకారం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని అన్నారు.‘ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత 1947లో కాంగ్రెస్ పార్టీని రద్దుచేయమని బాపూజీ అన్నారు. ఆయన సలహాలను పక్కనబెట్టి ఇన్నాళ్లూ పార్టీని నడుపుకొంటూ వచ్చారు. గాంధీ ఆ నాడు ఎందుకలా అన్నారో ఇప్పుడు అర్థమవుతోంది. 1947లో ఆయన చెప్పిందే కరెక్ట్’అని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ బీజేపీ మేనిఫెస్టోను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలను గోయల్ దృష్టికి తీసుకురాగా తీవ్రంగా స్పందించారు. భారతరత్న వీడీ సావార్కర్‌కు ఇస్తామంటున్న బీజేపీ అదేదో గాంధీజీ హంతకుడు గాడ్సేకు ఇస్తేబావుంటుందని తివారీ ధ్వజమెత్తారు. ఈనెల 21న జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేశారు. సామాజిక సంస్కర్తలు మహాత్మా జ్యోతిబా ఫూలే, ఆయన భార్య సావిత్రీబాయ్ ఫూలేతోపాటు హిందుత్వవాది సావార్కర్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రమైన విమర్శలు గుప్పించింది. సావార్కర్‌కు ఎందుకూ ఏకంగా గాంధీజీ హంతకుడు గాడ్సేకు ఇస్తేపోలా అంటూ మనీష్ తివారీ ధ్వజమెత్తారు. ‘బాపూజీ ఆశయాలు, ఆయన కన్న కలలను నిజం చేస్తున్న నాయకుడెవరో దేశంలోని అందిరికీ తెలుసు. గాంధీజీ అజెండాతో ముందుకెళ్తుంది ఎవరో జాతికి చెప్పల్సిన అవసరం లేదు’అని మంత్రి గోయల్ వ్యాఖ్యానించారు. ‘నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ ఆశయ సిద్ధికి కృషి చేస్తోంది. మోదీ నాయకత్వంలో పేదల ఉద్ధరణ కోసం పాటుపడుతున్నాం’అని కేంద్ర రైల్వేలు, వాణిజ్య-పరిశ్రమల మంత్రి స్పష్టం చేశారు. మోదీ ప్రతి కార్యక్రమం పేదలను ఉద్దేశించినదేనని ఆయన ఉద్ఘాటించారు. జీఎస్‌టీ వల్ల మహారాష్ట్ర ఆదాయానికి గండిపడిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ చేసిన వ్యాఖ్యలపై గోయల్ మండిపడ్డారు.‘బీజేపీ పాలిత రాష్ట్రాలు మాకు నష్టం జరిగిందని ఎక్కడా చెప్పలేదు. మధ్యలో గెహ్లోట్‌కు ఎందుకు? ఎవరికో నష్టం వాటిల్లిందని చెప్ప డం?’అని ఆయన విమర్శించారు. రాజస్థాన్ సమస్యలే మిగతా రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయని చెప్పడం అవివేకమని ఆయన అన్నారు. గెహ్లాట్ సీఎంగా ఉన్న రాజస్థాన్‌లోనే అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ బీజేపీ గెలిచిందని గోయల్ గుర్తుచేశారు. ‘ముందు మీ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలేమిటో చూసుకోండి.