జాతీయ వార్తలు

నిరంకుశ వైఖరికే వ్యతిరేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 17: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం రాజ్యాంగంలోని అధికరణం 370 రద్దు గురించి ప్రస్తావిస్తూ అధికార బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరి నుంచి కూడా ‘దేశభక్తి సర్ట్ఫికెట్’ పొందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అధికరణం 370ని రద్దు చేయడానికే కాంగ్రెస్ పార్టీ అనుకూలమని, అయితే, దానిని రద్దు చేయడానికి ఇప్పుడు అనుసరించిన నిరంకుశ వైఖరినే తమ పార్టీ వ్యతిరేకిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకూడదని ఆయన హితవు పలికారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ.. అధికరణం 370 విషయంలో కాంగ్రెస్ పార్టీపై దాడి చేస్తుండటంతో పాటు ఈడీ వివిధ కేసుల్లో శరద్ పవార్, ప్రఫుల్ పటేల్ సహా ఎన్‌సీపీ నాయకుల పాత్రపై దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మన్మోహన్ సింగ్ గురువారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దును పార్లమెంటులో ప్రతిపాదించడానికి అనుసరించిన నిరంకుశమయిన, అణచివేత వైఖరికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. అధికరణం 370ని రద్దు చేయడానికి ముందు జమ్మూకాశ్మీర్ ప్రజల మనసులు గెలుచుకోవాల్సి ఉండిందని ఆయన అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో అధికరణం 370 రద్దుకు అనుకూలంగానే ఓటు వేసింది. వ్యతిరేకంగా కాదు. అధికరణం 370 అనేది తాత్కాలిక చర్య అని, కాని, జమ్మూకాశ్మీర్ ప్రజల హృదయాలను గెలుచుకోవడం ద్వారానే దానిలో మార్పు తీసుకు రావాలనేది కాంగ్రెస్ పార్టీ భావన’ అని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు.
ఎన్‌డీఏ హయాంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈడీకి అధికారాలు సంక్రమించాయని, అయితే ఇతర పార్టీల నాయకులపై కక్ష సాధింపులకు ఈడీని ఉపయోగించుకోరాదని ఆయన అన్నారు. వీడీ సావర్కర్ పెంపొందించిన హిందూత్వ సిద్ధాంతానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్‌డీఏ ప్రభుత్వ పౌరసత్వ సవరణ బిల్లు ముస్లింల పట్ల వివక్షను ప్రదర్శిస్తోందని, అదొక విచ్ఛిన్నకరమయిన చర్య అని మన్మోహన్ సింగ్ విమర్శించారు.