జాతీయ వార్తలు

న్యాయ వ్యవస్థపై అనవసరపు భారాన్ని తగ్గించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో అపభుత్వం, దాని విభాగాల ఉదాసీనత, ఊగిసలాట ధోరణి, లేదా అసమర్థత కారణంగా న్యాయ వ్యవస్థపై పడుతున్న అనవసర భారం నుంచి దాన్ని విముక్తి చేయడానికి ఒక విధానాన్ని కనుగొనాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ న్యాయ శాఖను కోరారు. అంతేకాదు, ఏదయినా సమస్య కోర్టుకు వెలుపల పరిష్కరించుకునే అవకాశమున్నప్పుడు ఏ పౌరుడికి వ్యతిరేకంగానైనా కోర్టులో కేసును పోరాడాలా వద్దా అనే దాన్ని నిర్ణయించడానికి రిటైర్డ్ జడ్జీలతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ‘కేవలం ప్రభుత్వ ఉదాసీనత, ఊగిసలాట, లేదా అసమర్థత కారణంగా న్యాయ వ్యవస్థపై అనవసరపు భారం పడుతోంది. ఆ భారాన్ని పంచుకోవడానికి మేము సిద్ధంగా లేమని చెప్పడం లేదు. అయితే న్యాయ వ్యవస్థను ఈ భారంనుంచి తప్పించవచ్చు. అందుకు అవసరమైన విధానాన్ని కనుగొనమని న్యాయ మంత్రిత్వ శాఖను కోరుతున్నాను’ అని ఠాకూర్ అన్నారు. శనివారం ఇక్కడ సమాజంలోని బలహీన వర్గాలకు న్యాయ సహాయం అందించడం కోసం ఏర్పాటు చేసిన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కోసం థీమ్ సాంగ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కోర్టుకు రావడానికి ముందే కొన్ని అనవసరమైన కేసులను వడపోత పోసి అధికారుల స్థాయిలోనే పరిష్కరించవచ్చని ఆయన అన్నారు. ‘మేము పౌరులకు మా స్థాయిలో న్యాయం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా న్యాయం చేయాలి కదా? అసలు ఏ పౌరుడయినా కోర్టుకు ఎందుకు వెళ్లేలా చేయాలి. కోర్టు వెలుపలే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక యంత్రాంగాన్ని కనుగొనాలని న్యాయ మంత్రిత్వ శాఖను కోరుతున్నాను’ అని చీఫ్ జస్టిస్ అన్నారు.
హైకోర్టుకు 3నుంచి దసరా సెలవులు
హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు హైదరాబాద్ హైకోర్టుకు సెలవులు ప్రకటించారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఈ నెల 4న (మంగళవారం), 6న (గురువారం) జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ టి.సునీల్ చౌదరి డివిజన్ బెంచ్‌లు విచారణను కొనసాగిస్తాయి. జస్టిస్ ఎస్వీ భట్ సింగిల్ బెంచ్ రిట్ పిటిషన్లను స్వీకరిస్తుంది.