జాతీయ వార్తలు

మహారాష్ట్ర ఎన్నికలకు సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: మహారాష్ట్ర ఈ నెల 21 న జరగనున్న సాధారణ ఎన్నికలకు పొరుగురాష్ట్రాలైన తెలంగాణ తదితర రాష్ట్రాలు సహకరించాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ఇతర ఎన్నికల కమిషనర్లు విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితిపై పొరుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి మాట్లాడుతూ, మహారాష్ట్ర ల్రో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిసహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. మహారాష్ట్ర ల్రోని గడ్చిరోలి, నాందేడ్, చంద్రాపూర్, యావత్‌మాల్ జిల్లాలతో తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దు ఉందని జోషి గుర్తు చేశారు. మహారాష్ట్ర అధికారులతో ఇప్పటికే సమన్వయ సమావేశం నిర్వహించామని తెలిపారు. సరిహద్దుల్లో 14 చెక్‌పోస్టులు ఉన్నాయని, వీటి వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు,కౌంటింగ్ రోజు ఉదయం 6 గంటల నుండి కౌంటింగ్ పూర్తయ్యేవరకు మద్యం దుకాణాలను మూసిఉంచేందుకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, మహారాష్ట్ర అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నామని, 1800 వందల హోంగార్డులను శాంతి, భద్రతల పరిస్థితిని కాపాడేందుకు పంపించామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ మాట్లాడుతూ, పరిస్థితి అదుపులోనే ఉందని, మహారాష్ట్ర తో సహకరిస్తూ అవసరమైన అన్నిచర్యలు తీసుకున్నామన్నారు.